ఓటీటీలో ఈ వారం మైండ్ బ్లోయింగ్ సినిమాలు
సినిమా ప్రియులకు ఈ వారం ఓటీటీలో వినోపాల జాతర మొదలుకానుంది. అక్టోబర్ 5 నుంచి 11 మధ్య నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో, జియోహాట్‌స్టార్ వంటి ప్రముఖ ఓటీటీ వేదికలలో 8 ఆసక్తికరమైన సినిమాలు, వెబ్ సిరీస్‌లు, రియాలిటీ షోలు స్ట్రీమింగ్‌కు సిద్ధమయ్యాయి. వీటిలో బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టించిన చిత్రాలతో పాటు సరికొత్త థ్రిల్లర్లు కూడా ఉన్నాయి. ఈ వారం ఓటీటీలో సందడి చేయనున్న ఆ విశేషాలు ఇక్కడ తెలుసుకుందాం.
నెట్‌ఫ్లిక్స్ స్పెషల్స్
యానిమల్స్ (అక్టోబర్ 9): హాలీవుడ్ స్టార్ బెన్ అఫ్లెట్ ప్రధాన పాత్రలో నటించిన క్రైమ్ థ్రిల్లర్ ఇది. లాస్ ఏంజెల్స్ మేయర్ అభ్యర్థిగా నటిస్తున్న ఆయన జీవితంలో అనుకోని సంఘటన చోటుచేసుకుంటుంది. తన చిన్న కుమారుడు కిడ్నాప్ కావడంతో, ఒక తండ్రి పడే వేదన, ఆ సంక్షోభం నుంచి కుటుంబాన్ని ఎలా కాపాడుకున్నారనే థ్రిల్లింగ్ అంశాలతో ఈ సినిమా తెరకెక్చింది.

రిపోర్టింగ్ లైవ్ (అక్టోబర్ 9): బాలీవుడ్ నటి పరిణీతి చోప్రా ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్‌గా కనిపించనున్న చిత్రం. అక్రమ ఇసుక తవ్వకాలు జరుపుతున్న శక్తివంతమైన సిండికేట్ గుట్టు రట్టు చేయడానికి ఆమె, ఒక అనుభవజ్ఞుడైన కెమెరామ్యాన్‌తో కలిసి చేసే సాహసయాత్రే ఈ సినిమా కథాంశం.
ఇన్‌సైడ్ ది సర్కిల్ (అక్టోబర్ 7): నలుగురు ప్రాణస్నేహితుల జీవితాల చుట్టూ తిరిగే మెక్సికన్ థ్రిల్లర్ సిరీస్. ఓ రహస్య వీడియో లీక్ కావడం, ప్రముఖ నటి హత్యకు గురికావడం వంటి అనూహ్య పరిణామాలు ఈ స్నేహితుల ప్రాణాలకే ముప్పు తెచ్చేలా మారతాయి.
బిలో (అక్టోబర్ 8): జోష్ హార్ట్‌నెట్ లీడ్ రోల్‌లో నటించిన ఆరు ఎపిసోడ్‌ల కెనడియన్ హారర్ డ్రామా. తండ్రి మర్మమైన మరణం తాలూకు నీడ వెంటాడగా, తన కుటుంబాన్ని, జీవన విధానాన్ని కాపాడుకోవడానికి ఒక మత్స్యకారుడు చేసే పోరాటం ఇందులో ప్రధానాంశం.
మండాడి (అక్టోబర్ 9): తమిళనాడులోని సాంప్రదాయ పడవ రేసింగ్ నేపథ్యంలో తెరకెక్కిన అద్భుతమైన స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా 'మండాడి'. ఇందులో సూరి సరసన టాలెంటెడ్ నటుడు సుహాస్ ఒక ప్రత్యేకమైన పాత్రలో నటించి అదరగొట్టారు. థియేటర్లలో భారీ వసూళ్లు సాధించి, ఐఎండీబీలో ఏకంగా 9 రేటింగ్‌ను సొంతం చేసుకున్న ఈ విజువల్ వండర్ ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను అలరించడానికి వస్తోంది.
100 డేస్ ఆఫ్ డిసెప్షన్ (అక్టోబర్ 10): 1932లో జపాన్ వలస పాలనా కాలం నాటి జియోంగ్‌సియాంగ్ నేపథ్యంలో సాగే దక్షిణ కొరియా చారిత్రక గూఢచారి ప్రేమకథ. జెబుదొంగగా ఉన్న ఓ యువతి, అనువాదకురాలిగా వేషం మార్చి చేసే 100 రోజుల సీక్రెట్ మిషన్ నేపథ్యంలో ఈ సిరీస్ సాగుతుంది.
అమెజాన్ ప్రైమ్ వీడియోలో వచ్చే సినిమాలు
క్యారీ (అక్టోబర్ 7): సమ్మర్ హెచ్. హోవెల్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం సమాజానికి దూరంగా, కఠినమైన నిబంధనల మధ్య పెరిగిన ఒక యువతి చుట్టూ తిరుగుతుంది. తనను ఫ్యానాటికల్‌గా నియంత్రించే తల్లి నీడ నుంచి బయటపడేందుకు ఆమె పడే సంఘర్షణ ఇందులో హైలైట్‌గా నిలిచింది.
జియోహాట్‌స్టార్ లో
పతి పత్నీ ఔర్ పంగా సీజన్ 2 (అక్టోబర్ 10): ప్రముఖ సెలబ్రిటీ జంటల మధ్య జరిగే సరదా రియాలిటీ గేమ్ షో ఇది. జంటల మధ్య ఉన్న కెమిస్ట్రీ, సరదా సవాళ్లు, వారి వివాహ జీవితానికి సంబంధించిన ఆసక్తికర విషయాలతో ఈ రెండో సీజన్ మరింత వినోదాన్ని పంచనుంది.














Click it and Unblock the Notifications
