ఈ వారం ఓటీటీలో క్రేజీ థ్రిల్లర్లు

వీకెండ్‌ వచ్చేసింది.. ఇక ఓటీటీలో ఏ సినిమాలు చూడాలనే కన్ఫ్యూజన్‌కు ఫుల్‌స్టాప్ పెట్టేయండి! ఈ వారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన క్రేజీ థ్రిల్లర్లు, కడుపుబ్బా నవ్వించే వెబ్‌సిరీస్‌లతో పాటు డిజిటల్ స్ట్రీమింగ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన మోస్ట్ అట్రాక్టివ్ మూవీస్ లిస్ట్ మీముందుకు వచ్చేసింది. ఇంకెందుకు ఆలస్యం చూసేయండి.

బాక్సాఫీస్‌ను దడదడలాడిస్తున్న ఓటీటీ సినిమా.. కలెక్షన్ల సునామీ!
బాక్సాఫీస్‌ను దడదడలాడిస్తున్న ఓటీటీ సినిమా.. కలెక్షన్ల సునామీ!

థియేటర్ల నుంచి నేరుగా ఓటీటీలోకి వచ్చిన క్రేజీ సినిమాలు

మండాడి ( నెట్ ఫ్లిక్స్): సూరి, సుహాస్‌ కాంబినేషన్‌లో తెరకెక్కిన విజువల్ వండర్ 'మండాడి'. బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించిన ఈ చిత్రం, ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. మ‌దిమార‌న్ పుగళేంది దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీలో సముద్రం బ్యాక్‌డ్రాప్‌లో వచ్చే క్లైమాక్స్ సీన్స్ రోమాలు నిక్కబొడుచుకునేలా చేస్తాయి!

మగాళ్లతో పని లేదు.. ఇద్దరు అమ్మాయిల రొమాంటిక్ మూవీతో ఓటీటీ షేక్ !!
మగాళ్లతో పని లేదు.. ఇద్దరు అమ్మాయిల రొమాంటిక్ మూవీతో ఓటీటీ షేక్ !!
OTT Thrillers This Week Exciting Movies That Promise Edge-of-the-Seat Entertainment

ఖలీఫా: ది రూలర్‌ (అమెజాన్ ప్రైమ్): మలయాళ స్టార్ పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ హీరోగా, మాళవిక శర్మ హీరోయిన్‌గా వైశాఖ్‌ డైరెక్షన్‌లో వచ్చిన ఈ యాక్షన్ థ్రిల్లర్‌లో మోహన్‌లాల్ క్యామియో రోల్‌లో అదరగొట్టారు. తెలుగు, మలయాళ భాషల్లో అమెజాన్ ప్రైమ్‌లో ఇది అందుబాటులో ఉంది.

ఎపిక్‌: ఫస్ట్‌ సెమిస్టర్‌ (నెట్ ఫ్లిక్స్): ఆనంద్‌ దేవరకొండ, వైష్ణవి చైతన్య జోడీగా ఆదిత్య హాసన్‌ తెరకెక్కించిన క్యూట్ రొమాంటిక్‌ డ్రామా ఇది. శివాజీ, వాసుకీ కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమా ఇప్పుడు తెలుగుతో పాటు తమిళ, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లోనూ నెట్‌ఫ్లిక్స్‌లో సందడి చేస్తోంది.

ప్రథమ దృష్ట్య కుట్టక్కర్‌ (నెట్ ఫ్లిక్స్): క్రైమ్ థ్రిల్లర్ సినిమాలంటే మలయాళ ఇండస్ట్రీ తర్వాతే ఎవరైనా! పార్వతి తిరువోతు ప్రధాన పాత్రలో షాహాద్ దర్శకత్వంలో తెరకెక్కి బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ. 50 కోట్లకు పైగా వసూలు చేసిన ఈ సంచలన చిత్రం ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో (మలయాళం) స్ట్రీమింగ్ అవుతోంది.

కడుపుబ్బా నవ్వించే వెబ్‌సిరీస్

లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ (ఈటీవీ విన్): మన ఫన్ అండ్ ఎంటర్‌టైనర్ హర్ష చెముడు లీడ్ రోల్‌లో నటించిన క్రేజీ సిరీస్ ఇది. బాబా డేగల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సిరీస్‌లో హైపర్‌ ఆది, జీవన్‌ కుమార్, శ్రావ్య చౌదరి తమ కామెడీ టైమింగ్‌తో కడుపుబ్బా నవ్విస్తున్నారు. ఈ వీకెండ్ ఎంటర్‌టైన్‌మెంట్‌కు ఇది పర్ఫెక్ట్ ఛాయిస్!

ఈ వారం వివిధ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌లలో మరికొన్ని ఇంట్రెస్టింగ్ సినిమాలు, సిరీస్‌లు
అమెజాన్ ప్రైమ్: స్పైడర్‌మ్యాన్‌: బ్రాండ్‌ న్యూ డే (ఇంగ్లీష్/తెలుగు), క్యారీ: సీజన్‌ 1 (వెబ్‌సిరీస్ - ఇంగ్లీష్/తెలుగు), పారిస్‌ కేఫ్‌ (మూవీ - తమిళ్)

నెట్‌ఫ్లిక్స్: టేక్‌ ఛార్జ్‌ ఆఫ్‌ మై హార్ట్‌ (వెబ్‌సిరీస్ - కొరియన్‌/తెలుగు), రిపోర్టింగ్‌ లైవ్‌ (మూవీ - హిందీ), ఐయామ్‌ సోలో, అన్‌ ఫర్‌గెటబుల్‌, ఇన్‌సైడ్‌ ది సర్కిల్‌, బిలో వంటి పలు ఇంగ్లీష్/కొరియన్ వెబ్‌సిరీస్‌లు. సోనీలివ్‌: ఐస్‌ (వెబ్‌సిరీస్ - మలయాళం/తెలుగు), డిస్నీ ప్లస్ హాట్‌స్టార్: మోర్టల్‌ కాంబాట్‌ 2 (మూవీ - ఇంగ్లీష్/తెలుగు).

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+