ఓటీటీలో తప్పకుండా చూడాల్సిన టాప్-7 మూవీస్

ఓటీటీ ప్రియులకు వీకెండ్‌లో అసలైన కిక్ ఇవ్వడానికి కొన్ని అదిరిపోయే సినిమాలు, వెబ్ సిరీస్‌లు సిద్ధంగా ఉన్నాయి. గుణశేఖర్ 'యుఫోరియా' నుంచి మలయాళీ టైమ్ లూప్ థ్రిల్లర్ 'సంభవం అధ్యాయం ఒన్ను' వరకు... ఒక్కో సినిమా మిమ్మల్ని కచ్చితంగా సీట్ ఎడ్జ్ మీద కూర్చోబెడుతుంది. మరి ఆ 7 ఇంట్రెస్టింగ్ కంటెంట్స్ ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్నాయో ఇక్కడ తెలుసుకోండి.

సూర్య కొత్త సినిమా కథ లీక్? పాత బ్లాక్‌బస్టర్‌నే మళ్లీ తీస్తున్నారా?
సూర్య కొత్త సినిమా కథ లీక్? పాత బ్లాక్‌బస్టర్‌నే మళ్లీ తీస్తున్నారా?

1. యుఫోరియా (ఈటీవీ విన్ / ఆహా): టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు గుణశేఖర్ తెరకెక్కించిన ఈ చిత్రం యూత్‌ను ఆకట్టుకునేలా రూపొందింది. ఆయన నుంచి ఇలాంటి డిఫరెంట్ మూవీ రావడం నిజంగా సర్ప్రైజింగ్ అనే చెప్పాలి. భూమిక, సారా అర్జున్, గౌతమ్ వాసుదేవ్ మీనన్ కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమా ప్రస్తుతం ఈటీవీ విన్, ఆహాలో అందుబాటులో ఉంది.

OTT Top 7 Movies That Deserve a Spot on Your Watchlist

2. హ్యూమింట్ - (నెట్‌ఫ్లిక్స్): కొరియన్ స్పై యాక్షన్ థ్రిల్లర్‌లను ఇష్టపడేవారికి ఇది పర్ఫెక్ట్ ఛాయిస్. సౌత్, నార్త్ కొరియా ఏజెంట్స్ మధ్య జరిగే కోల్డ్ వార్, మైండ్ బ్లాక్ చేసే యాక్షన్ సీన్లు మిమ్మల్ని స్క్రీన్‌కి కట్టిపడేస్తాయి.

3. డిటెక్టివ్ హోల్ (నెట్‌ఫ్లిక్స్): క్రైమ్ థ్రిల్లర్ జోనర్ ఇష్టపడేవారికి నెక్స్ట్ లెవల్ ట్రీట్ ఇది. వరుస సీరియల్ హత్యల మిస్టరీని ఛేదించే ఓ డిటెక్టివ్ ఇన్వెస్టిగేషన్ కథ ఇది. దీని స్క్రీన్ ప్లే అడుగడుగునా ఉత్కంఠ రేపుతుంది.

9 ఓటీటీల్లోకి విడుదలవుతున్న సంచలన సినిమా
9 ఓటీటీల్లోకి విడుదలవుతున్న సంచలన సినిమా

4. క్రైమ్ 101 (ప్రైమ్ వీడియో): 'థోర్' ఫేమ్ క్రిస్ హెమ్స్‌వర్త్ లీడ్ రోల్‌లో నటించిన అదిరిపోయే రాబరీ థ్రిల్లర్ ఇది. భారీ యాక్షన్ హంగామా కంటే బలమైన డ్రామా, మైండ్ గేమ్‌లతో ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.

5. మట్కా కింగ్ (ప్రైమ్ వీడియో): విజయ్ వర్మ, కృతిక కమ్ర ప్రధాన పాత్రల్లో నటించిన ఈ వెబ్ సిరీస్ ముంబై మట్కా బ్యాక్‌డ్రాప్‌పై తెరకెక్కింది. మట్కా ప్రపంచాన్ని అత్యంత రియలిస్టిక్‌గా చూపించిన ఈ సిరీస్‌లో విజయ్ వర్మ నటన ప్రధాన ఆకర్షణగా నిలిచింది.

6. సంభవం అధ్యాయం ఒన్ను (జియో హాట్‌స్టార్): మలయాళీ సినిమా అంటేనే కంటెంట్ కింగ్ అని మరోసారి నిరూపించిన చిత్రమిది. అడవి నేపథ్యంలో సాగే టైమ్ లూప్ కాన్సెప్ట్ సినిమా ఇది. ఇందులో వచ్చే ప్రతి ట్విస్ట్ మైండ్ బ్లాక్ చేసేలా ఉంటుంది.

7. రెంటల్ ఫ్యామిలీ (జియో హాట్‌స్టార్): జపాన్ నేపథ్యంలో సాగే ఒక ఎమోషనల్ అండ్ హార్ట్ టచింగ్ డ్రామా ఇది. సినిమా మొదలైన మొదటి సీన్ నుంచే ప్రేక్షకులు ఆ ప్రపంచంలోకి లీనమైపోయేలా అద్భుతమైన భావోద్వేగాలతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. మరి ఆలస్యం ఎందుకు? ఈ వీకెండ్‌కు మీ వాచ్‌లిస్ట్ రెడీ చేసుకొని ఎంజాయ్ చేసేయండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+