ఓటీటీలో వీకెండ్ జాతర... ఒక్కరోజే 19 సినిమాలు, వెబ్ సిరీస్‌లు
వీకెండ్ వచ్చిందంటే కొత్త సినిమాలు, సిరీస్‌ల కోసం వాచ్‌లిస్ట్‌లు సిద్ధం చేసుకునే ప్రేక్షకులకు ఈ శుక్రవారం పండుగే అనాలి. నవంబర్ 20న ఒక్కరోజే వివిధ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో ఏకంగా 19 కొత్త సినిమాలు, వెబ్‌సిరీస్‌లు స్ట్రీమింగ్కు వచ్చాయి. తెలుగుతో పాటు హిందీ, తమిళం, మలయాళం, ఇంగ్లీష్, కొరియన్, స్పానిష్ భాషల్లో వైవిధ్యమైన కంటెంట్ అందుబాటులో ఉంది. హారర్, థ్రిల్లర్, కామెడీ, రొమాన్స్, ఫ్యామిలీ డ్రామా, సైన్స్ ఫిక్షన్ ఇలా ప్రతి జానర్‌కు ఇందులో చోటు దొరికింది.
నెట్‌ఫ్లిక్స్‌లోనే సగం హంగామా
ఈ వారం కొత్త కంటెంట్‌తో నెట్‌ఫ్లిక్స్ దూకుడు మీదుంది. ఏకంగా 9 సినిమాలు, వెబ్‌సిరీస్‌లను ఈ ప్లాట్‌ఫామ్ ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చింది. తెలుగు సైకలాజికల్ హారర్ థ్రిల్లర్ '418', తమిళ రొమాంటిక్ కామెడీ తెలుగు వెర్షన్ 'హైకూ', హిందీ ఫ్యామిలీ కామెడీ 'ఢింఢోరా సీజన్ 2' ఇందులో ముఖ్యమైనవి. వీటితో పాటు కొరియన్ క్రైమ్ థ్రిల్లర్ 'ది బ్లూ రోడ్', యానిమేషన్ మూవీ 'స్టెప్స్', 'మాంగ్లిక్', 'సమ్‌థింగ్ న్యూ', 'ఆన్ బీహాఫ్ ఆఫ్ మై సన్', 'ప్రైమ్‌టైమ్ ప్రీచర్స్' కూడా స్ట్రీమింగ్ అవుతున్నాయి.

ప్రైమ్ వీడియోలో హారర్, మిస్టరీ టచ్
అమెజాన్ ప్రైమ్ వీడియోలోనూ మూడు ఆసక్తికరమైన ప్రాజెక్టులు వచ్చాయి. స్పానిష్ మిస్టరీ థ్రిల్లర్ సిరీస్ 'పర్ఫెక్ట్ లయర్స్', హిందీ ఫోక్ మైథలాజికల్ హారర్ థ్రిల్లర్ 'ది వాన్: ఫోర్స్ ఆఫ్ ది ఫారెస్ట్', తమిళ హారర్ ఫాంటసీ సైన్స్ ఫిక్షన్ చిత్రం 'డ్రోన్స్' అందుబాటులోకి వచ్చాయి. ఇందులో 'ది వాన్' సినిమాను అదనపు అద్దె లేకుండా చూడొచ్చు.
తెలుగు ఆడియన్స్‌కు బోలెడు ఆప్షన్లు
తెలుగులో చూడటానికి కూడా ఈ వారం మంచి ఆప్షన్లే ఉన్నాయి. నెట్‌ఫ్లిక్స్‌లోని '418', 'హైకూ'తో పాటు సన్ నెక్ట్స్‌లో 'అనుమాన పక్షి', 'చిరం', ఆహాలో 'క్రేజీ కళ్యాణం' స్ట్రీమింగ్కు వచ్చాయి. మరోవైపు జీ5లో 'టీన్ తిగడా', సోనీ లివ్‌లో 'అన్బిల్ అవన్', ఆపిల్ టీవీ ప్లస్‌లో 'వే ఆఫ్ ది వారియర్ కిడ్', జియో హాట్‌స్టార్‌లో 'పెర్సీ జాక్సన్ అండ్ ది ఒలింపియన్స్' మూడో సీజన్ కూడా అందుబాటులో ఉన్నాయి. మొత్తానికి ఈ వీకెండ్ ఇంట్లోనే ఉండి సినిమాలు, సిరీస్‌లు చూడాలనుకునేవారికి ఈ 19 రిలీజ్లు మంచి వినోదాన్ని పంచేలా ఉన్నాయి.














Click it and Unblock the Notifications
