పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ స‌ర‌స‌న‌ పాకిస్తాన్ బ్యూటీ..

పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ న‌టించిన క‌ల్కి చిత్రం బాక్సాఫీస్ బ‌ద్ద‌లు కొట్టిన సంగ‌తి తెలిసిందే. ఇక‌, ఈ చిత్రం త‌ర్వాత ప్ర‌భాస్ రాజాసాబ్, స‌లార్ 2 వంటి సినిమాల‌తో బిజిగా ఉన్నాడు. ఇదిలా ఉండ‌గా, ప్ర‌భాస్ మ‌రో సినిమాకు కూడా గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్లు తెలుస్తోంది. హను రాఘవపూడి ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమాకు రెడీ అవుతున్న‌ట్లు టీ టౌన్ వ‌ర్గాల్లో టాక్‌. ద‌ర్శ‌కుడు హ‌ను రాఘ‌వ‌పూడి గ‌తంలో ప‌డి పడి లేచే మనసు, సీతారామం, అందాల రాక్షసి వంటి చిత్రాల‌తో మంచి విజ‌యం సాధించారు. ఇక‌, వీరిద్ద‌రి కాంబోలో ఇప్ప‌డు సినిమా రాబోతుంది. ఈ సినిమాకు సంబంధించి 'ఫౌజీ' అనే వ‌ర్కింగ్ టైటిల్‌ను కూడా రూపొందించిన‌ట్లు తెలుస్తోంది. ఈ చిత్రం భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్క‌బోతుంద‌ట‌. ఈ మూవీ మైత్రీ మూవీ బ్యాన‌ర్‌లో రానుంది.

ఇక‌, ఫౌజీ చిత్రానికి సంబంధించిన ఓ న్యూస్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఈ సినిమాలో పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ స‌ర‌స‌న పాకీస్తానీ బ్యూటీ ని తీసుకుంటున్న‌ట్లు తెగ ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈ క్రమంలో పాకిస్థాన్ న‌టి సజల్ అలీని మూవీ మేక‌ర్స్ సంప్రదిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే, ఈ విష‌యంపై అధికారికంగా చిత్ర యూనిట్ ఎటువంటి ప్ర‌క‌ట‌న చేయ‌లేదు. పాకిస్తానీ న‌టి సజల్ అలీ గ‌తంలో బాలీవుడ్ సినిమాలో న‌టించింది. అల‌నాటి న‌టి శ్రీదేవితో కలిసి మామ్ అనే బాలీవుడ్ సినిమాలో ఈ బ్యూటీ క‌నిపించింది. ఆ త‌ర్వాత మ‌రే ఇత‌ర సినిమాలు చేయ‌లేదు.

Pakistani beauty opposite pan India star Prabhas

అక్టోబ‌ర్‌లో షూటింగ్ స్టార్ట్‌..

ఈ సినిమాకు 'ఫౌజీ' అనే టైటిల్ పెట్టే ఆలోచ‌న‌లో ఉన్న‌ట్లు స‌మాచారం. ఫౌజీ అంటే సైనికుడు అని అర్థం వ‌స్తుంది. అంటే ఈ చిత్రంలో పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్‌ని సైనికుడిగా చూడొచ్చు. అందుకూ ఈ టైటిల్ సినిమాకి సూటవుతుంద‌ని చిత్ర యూనిట్ భావిస్తోంద‌ట‌.. ఈ సినిమాలోని క‌థ స్వాతంత్య్రానికి పూర్వం జరిగే విష‌యాల గురించి ఉన్న‌ట్లు తెలుస్తోంది. సందీప్ రెడ్డి వంగా ద‌ర్శ‌క‌త్వంలో ప్ర‌భాస్ చేస్తోన్న చిత్రం 'స్పిరిట్'. ఇక‌, ఈ సినిమాకు సంబందించిన ప్రీ ప్రోడ‌క్ష‌న్ ప‌నులు ఆల‌స్యమ‌వుతుండ‌డంతో అంత‌లో'ఫౌజీ' క‌థ‌ను సెట్స్‌పైకి తీసుకెళ్లే ఆలోచ‌న‌లో చిత్ర యూనిట్ ఉన్న‌ట్లు తెలుస్తోంది. అందుకే ఈ సినిమా అక్టోబ‌ర్‌లో షూటింగ్ మొద‌లుపెట్ట‌నున్న‌ట్లు స‌మాచారం. ఇక‌, ఈ చిత్రానికి విశాల్‌ చంద్రశేఖర్‌ బాణీలు సమకూర్చ‌నున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+