టూత్‌బ్రష్ కొనివ్వలేదని కొడుకు మీద కేసు పెట్టిన తండ్రి!

టూత్‌బ్రష్ కొనివ్వలేదని ఓ వృద్ధ తండ్రి తన కొడుకు మీద కేసు వేసి కోర్టు మెట్లెక్కితే ఎలా ఉంటుందనే కామెడీ కాన్సెప్టుతో వస్తున్న సరికొత్త సినిమా 'పల్లబురుసు'. గ్రామీణ నేపథ్యంలో సహజసిద్ధమైన హాస్యం, గుండెలకు హత్తుకునే కుటుంబ అనుబంధాల కలబోతగా ఈ సినిమాను డైరెక్టర్ ఉదయ్ చౌహాన్ తెరకెక్కించారు. అన్నపూర్ణ స్టూడియోస్, ఎపిక్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మింటిన ఈ చిత్రం అధికారిక ట్రైలర్ తాజాగా విడుదలై ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ప్రముఖ హీరో అక్కినేని నాగార్జును ఈ ట్రైలర్ ను ఆవిష్కరించారు. ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ నేపథ్యంలో సినీ వర్గాల్లోనూ, ప్రేక్షకుల్లోనూ అంచనాలు భారీగా పెరుగుతున్నాయి. సీనియర్ నటులు సుధాకర్ రెడ్డి, మురళీధర్ గౌడ్ కీలక పాత్రల్లో నటించగా.. ఈ చిత్రం ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది.

పోలీసులనే భయపెట్టిన హంతకుడు.. నిజమైన థ్రిల్లర్ సినిమా ఓటీటీలో
పోలీసులనే భయపెట్టిన హంతకుడు.. నిజమైన థ్రిల్లర్ సినిమా ఓటీటీలో

సొంత కొడుకు తనకు కనీసం ఓ టూత్ బ్రష్ కూడా కొనివ్వలేదని తండ్రి చేసే ఓ చిన్న ఆరోపణతో స్టోరీ ప్రారంభమవుతుంది. "సారూ.. నా కొడుకు మీద కేసు వేయాలంటూ ఓ ముసలాయన పోలీస్ స్టేషన్కు వచ్చి రచ్చ చేస్తాడు. ఎందుకు కొట్టిండా? పొడిసిండా? అని పోలీసులు ఆశ్చర్యంగా అడిగితే.. "లేదు సార్.. నాకు పల్లబురుసు కొనియ్యలే" అని ఆ తాత చెప్పే అమాయకపు డైలాగ్ తో సినిమా ఏ స్థాయిలో నవ్వించబోతోందో అర్థమైపోతుంది. కేవలం ఓ పల్లబురుసు కోసం ఆ వృద్ధుడితో పాటు చుట్టుపక్కల వారు పడే తాపత్రయం అవుట్ అండ్ అవుట్ ఫన్ ను పండించింది. ఊహించని ఈ చిన్న కారణం క్రమంగా పెద్ద కుటుంబ వివాదంగా రూపాంతరం చెందుతుంది. అపార్థాలు పెరిగి పెద్దవవ్వడం, చివరకు అది కోర్టులో న్యాయ పోరాటాలకు దారితీయడం, కుటుంబ బంధాలు తీవ్ర పరీక్షకు గురవడం వంటి అంశాలను ట్రైలర్‌లో ఎంతో ఆసక్తికరంగా చూపించారు.

Pallaburusu Movie Trailer Son Sued Over Toothbrush in Nag-Backed Rural Comedy Releasing Aug 14

ట్రైలర్ ముగింపులో "ఏం తాతా లంకె బిందెలు వెతుకుతున్నావా" అని ఒకరు అడిగితే.. "లంకె బిందెలా? అదొక్కటే తక్కువైంది నా మొఖానికి. బొంద తవ్వుతున్నా" అని ఆ ముసలాయన సమాధానమిస్తాడు. ఎవరిది అని తిరిగి అడగ్గా.. "నాదే" అని ఆ తాత చెప్పే సంభాషణ గుండెను పిండేసే ఎమోషన్ తో పాటు సరదా ఎలిమెంట్ ను కూడా మిక్స్ చేసి చూపించింది. ఈ సినిమాలో నటించిన నటీనటులందరూ తెలంగాణ గ్రామీణ యాసలో జీవించేశారు.

Korean Kanakaraju Review:సత్య నవ్వించాడు..కనకరాజు ఆకట్టుకున్నాడా..?
Korean Kanakaraju Review:సత్య నవ్వించాడు..కనకరాజు ఆకట్టుకున్నాడా..?

ఆగస్టు 14న థియేటర్లలో సందడి
మొత్తానికి 'పల్లబురుసు' ట్రైలర్ చూస్తుంటే.. కుటుంబ సమేతంగా థియేటర్లకు వచ్చి హాయిగా నవ్వుకోవడంతో పాటు కాసేపు ఆలోచింపజేసే చక్కటి ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా నిలిచిలా కనిపిస్తోంది. అన్నపూర్ణ స్టూడియోస్ ఈ ప్రాజెక్టుతో జతకట్టడం సినిమా నాణ్యతపై మరింత నమ్మకాన్ని పెంచుతోంది. ఆగస్టు 14న విడుదల కానున్న ఈ సినిమా ప్రేక్షకాదరణ పొందుతుందో లేదో వేచి చూడాల్సిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+