హిందీలో రికార్డులను బద్దలు బద్దలు కొట్టిన 'సలార్'
ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా సంచలనం సలార్. ఈ చిత్రం దేశవ్యాప్తంగా విడుదలై ఇప్పటికే రూ.550 కోట్లకు పైగా కలెక్ట్ చేసింది. రూ.వెయ్యి కోట్ల వసూళ్లు దిశగా పరుగులు తీస్తోంది. హోంబలే ఫిలింస్ ఈ చిత్రాన్ని నిర్మించింది. డైనోసార్ దెబ్బకు ఎవరైనా సరే అబ్బా అనాల్సిందే అన్నట్లుగా సినిమా వసూళ్లు ఉన్నాయి. షారుక్ ఖాన్ కాదుకదా.. ఏ ఖాన్ సాబ్ ఉన్నా ప్రభాస్ బరిలోకి దిగితే బాక్సాఫీసును ఊచకోత కోయడమేనని ప్రభాస్ నిరూపిస్తున్నారు.
దేశవ్యాప్తంగా ఉన్న హీరోల్లో నిఖార్సైన్ పాన్ ఇండియా హీరోగా తనను ఎందుకు పరిణగిస్తారో మరోసారి చూపిస్తున్నారు. బాహుబలి1, బాహుబలి2, సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్ తర్వాత సలార్ విడుదలైంది. బాహుబలి చిత్రాలతోనే తన పాన్ ఇండియా రేంజ్ ను చూపించాడు. ఉత్తరాది రాష్ట్రాల్లోని హిందీ బెల్టుతో ఈ చిత్రం రూ.110 కోట్లకు పైగా షేర్ రాబట్టి రూ.200 కోట్ల షేర్ రాబట్టే దిశగా పరుగులు తీస్తోంది.

సలార్ చిత్రం విడుదలకు ముందురోజు వరకు థియేటర్లను ఇవ్వనీయకుండా కొందరు ప్రముఖులు ఇబ్బందులు పెట్టారు. అటువంటి అడ్డంకులేవీ ప్రభాస్ పాన్ ఇండియా క్రేజ్ ను నిలవరించలేకపోయాయి. ప్రభాస్ ఎదుగుదలను తట్టుకోలేని కొందరు ఇందులో ఉన్నట్లు తెలుస్తోంది. ఓవర్సీస్ లో 8 మిలియన్ డాలర్ల కలెక్షన్లను దాటేసి 10 మిలియన్ డాలర్లవైపు పరుగులు తీస్తోంది. బెంగళూరులో మొదటివారంలో 6వేలకు పైగా షోలు పడి సినీ విశ్లేషకులను ఆశ్చర్యంలో ముంచెత్తింది. నార్త్ లో కేవలం ఐదురోజుల్లోనే రూ.105 కోట్ల షేర్ రాబట్టిందంటే ప్రభాస్ స్టార్ డం ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు. మున్ముందు ఈ సినిమా ఇంకెన్ని రికార్డులు సృష్టించనుందో చూడాలి.












Click it and Unblock the Notifications