ప్రభాస్ కు ఇష్టమైన స్టార్ హీరో ఎవరో తెలుసా?

ఈ తరం స్టార్ హీరోల్లో పాన్ ఇండియా రెబల్ స్టార్ గా, డార్లింగ్ గా అందరి హృదయాలను దోచుకుంది మాత్రం ప్రభాస్ ఒక్కడే అని చెప్పవచ్చు. సినిమాల్లో విలన్లను హీరో కొడుతుంటే అందరూ ఎంజాయ్ చేస్తా చూస్తుంటారు. అటువంటి పోరాట దృశ్యాల్లో ప్రభాస్ లాంటి పర్ ఫెక్ట్ కటౌట్ రౌడీలను కొడుతుంటే చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఆస్వాదిస్తారు. హీరో అనే పదానికి సరైన నిర్వచనంగా ప్రభాస్ ను వర్ణిస్తారు. అటువంటి స్టార్ హీరోకు ప్రస్తుత తరంలో ఇష్టమైన నటుడు ఒకరున్నారు.

ఆయనెవరో కాదు.. పవర్ స్టార్ పవన్ కల్యాణ్. పవన్ కల్యాణ్ అంటే తనకు ఎంతో ఇష్టమని చాలా సందర్భాల్లో డార్లింగ్ చెప్పారు. చాలాసార్లు బహిరంగ వేదికల్లో ఐలవ్ పవన్ కల్యాణ్ అని కూడా చెప్పాడు. విశాఖపట్నంలో సత్యానంద్ దగ్గరే ప్రభాస్ నటనలో శిక్షణ తీసుకున్నారు. పవన్ కల్యాణ్ కూడా అక్కడే శిక్షణ తీసుకున్నారు. ప్రధానంగా పవన్ సినిమాలంటే డార్లింగ్ కు విపరీతమైన ఇష్టం. అందులోను ఖుషి సినిమా అంటే ఇంకా ఇష్టం. ఆ సినిమాను లెక్కలేనన్ని సార్లు చూసినట్లు రెబల్ స్టార్ స్వయంగా చెప్పారు.

pan india rebal star prabhas favorite hero

ప్రస్తుతం ఈ ఇద్దరు హీరోలు వరుసపెట్టి సినిమాలు చేస్తున్నారు. ఎన్నికలు దగ్గర పడుతుండటంతో పవన్ కొంత విరామం ప్రకటించారు. ప్రభాస్ ఇటీవలే సలార్ చిత్రంతో భారీ హిట్ కొట్టారు. రాజాసాబ్, కల్కి విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. తర్వాత సందీప్ దర్శకత్వంలో స్పిరిట్ చేయబోతున్నారు. పవన్ కల్యాణ్ కూడా ఎన్నికలు ముగిసిన తర్వాత సాధ్యమైనంత త్వరగా ఒప్పుకున్న సినిమాలను పూర్తిచేసి రాజకీయంగా బిజీగా మారిపోవాలని యోచిస్తున్నారు. ఉస్తాద్ భగత్ సింగ్, హరిహర వీరమల్లు, ఓజీ సినిమాలను ముందుగా పూర్తిచేయాల్సిన బాధ్యత పవన్ పై ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+