'కల్కి' ఆల్‌టైమ్ రికార్డ్.. కలెక్షన్స్‌లో సంచలనం!

యంగ్ రెబల్‌స్టార్, డార్లింగ్ ప్రభాస్‌ 'కల్కి' సినిమా సంచలనం సృష్టిస్తోంది. పురాణాలకు సైన్స్‌ను ముడిపెట్టి దర్శకుడు నాగ్ అశ్విన్‌ తెరకెక్కించిన ఈ చిత్రం విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకోవడమేకాదు.. చూసినవారంతా నాగ్ దర్శకత్వ ప్రతిభకు ఫిదా అవుతున్నారు. నటీనటుల నటన.. ముఖ్యంగా ప్రభాస్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొనే నటనకు ప్రేక్షకులంతా తన్మయత్వం చెందుతున్నారు. విడుదలకు ముందే ఎన్నో రికార్డులను సొంతం చేసుకున్న కల్కి విడుదల తర్వాత కూడా తన హవాను కొనసాగిస్తోంది. ఉత్తర అమెరికాలో ఆల్ టైమ్ రికార్డును నెలకొల్పింది.

హాలీవుడ్ ప్రేక్షకుల నుంచి ఆదరణ
నాగ్‌ అశ్విన్‌ ఈ సినిమాను హాలీవుడ్‌ రేంజ్‌లో రూపొందించారు. దీంతో అక్కడి ప్రేక్షకులను కూడా బాగా ఆకట్టుకుంటోంది. ఉత్తర అమెరికాలో ప్రీ సేల్ బుకింగ్ లోనే పలు రికార్డులను బద్దలు కొట్టిన 'కల్కి' విడుదలై తర్వాత అన్నింటినీ దాటేసి మొదటి స్థానంలో నిలబడింది. ప్రీమియర్స్‌ కలెక్షన్స్‌లోనే 3.8 మిలియన్‌ డాలర్లతో అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ చిత్రంగా నిలిచింది. ప్రీమియర్స్‌లోనే 'ఆర్‌ఆర్‌ఆర్‌' కలెక్షన్స్‌ దాటడం విశేషం. 'కల్కి' తర్వాత స్థానాల్లో 'ఆర్‌ఆర్ఆర్‌' (3.46మిలియన్లు), 'సలార్‌' (2.6మిలియన్లు), 'బాహుబలి2' (2.45మిలియన్లు)నిలిచాయి.

pan india rebal star prabhas kalki 2898 ad all time record and collection details here

మొదటిరోజే 5 మిలియన్ డాలర్లు
ప్రీమియర్స్‌, మొదటిరోజు కలెక్షన్స్‌ కలిపి అమెరికాలో 5 మిలియన్‌ డాలర్లు వసూలయ్యాయి. అమెరికాలో ఎక్కువ కలెక్షన్లు సాధించిన తెలుగు సినిమాల్లో 'కల్కి' ఒక్క రోజులోనే 5వ స్థానాన్ని కైవసం చేసుకుంది. నాలుగైదు రోజులు గడిచేసరికి టాప్ స్థానంలో నిలబడొచ్చని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అత్యంత వేగంగా 5 మిలియన్ డాలర్లు వసూలు చేసిన సినిమాగా రికార్డు నెలకొల్పింది. ఈ కలెక్షన్లు ఇలాగే కొనసాగితే అద్భుతమైన రికార్డులను ఈ సినిమా సొంతం చేసుకుంటుందని ట్రేడ్ పండితులు అభిప్రాయపడుతున్నారు. మొదటి మూడురోజుల్లో మరిన్ని కలెక్షన్లు 'కల్కి' కొల్లగొట్టే అవకాశం ఉందంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+