'కల్కి' రివ్యూ: ప్రభాస్ బ్లాక్‌బస్టర్ కొట్టాడా?

నటీనటులు
ప్రభాస్‌, అమితాబ్‌ బచ్చన్‌, కమల్‌ హాసన్‌, దీపికా పదుకొణె, దిశా పటానీ, రాజేంద్రప్రసాద్‌, బ్రహ్మానందం, శోభన, స్వాస్థ ఛటర్జీ, పశుపతి, విజయ్‌ దేవరకొండ, మృణాళ్‌ఠాకూర్‌, దుల్కర్‌ సల్మాన్‌ తదితరులు
సంగీతం: సంతోష్‌ నారాయణన్‌
ఎడిటింగ్‌: కోటగిరి వెంకటేశ్వరావు
సినిమాటోగ్రఫీ: జోర్డే స్టోవిల్కోవిచ్‌
సంభాషణలు: సాయి మాధవ్‌ బుర్రా
నిర్మాత: సి.అశ్వనీదత్‌
కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: నాగ్‌ అశ్విన్‌
విడుదల తేదీ: 27-06-2024

కథ
మహాభారత యుద్ధంలో తన కోపం వల్ల కృష్ణుడి చేత అశ్వత్థామ (అమితాబ్ బచ్చన్) శాపగ్రస్తుడవుతాడు. వేల సంవత్సరాలపాటు మహావిష్ణువు పదో అవతారమైన కల్కి పుట్టుకోసం ఎదురుచూస్తుంటాడు. కలియుగం అంతమయ్యే చివరి దశలో భూమండలానికి ఆఖరి నగరమైన కాశీ దగ్గర కాంప్లెక్స్ ను ఏర్పాటు చేసి మరో ప్రపంచం కోసం సుప్రీం యాస్కిన్ (కమల్ హాసన్) పరితపిస్తుంటాడు. మానవజాతిని అతను ఛీత్కారంగా చూస్తుంటాడు. చిన్న చిన్న దొంగతనాలు చేస్తూ మిలియన్ యూనిట్స్ సంపాదించి కాంప్లెక్స్ లో స్థిరపడదామని భైరవ (ప్రభాస్) నానా పాట్లు పడుతుంటాడు.

pan india rebal star prabhas kalki 2898 ad review

కొన్ని యూనిట్స్ కోసం చిన్నతప్పుడే తండ్రి చేత అమ్మివేయబడ్డ అమ్మాయి సు-ఎంఐ8 అలియాస్ సుమతి (దీపికా పదుకొనే). అసలు ఈ నలుగురి మధ్య సంబంధం ఏమిటి? యాస్కిన్ ధ్యేయానికి అశ్వత్థామ ఎలా ఎదురు నిలిచాడు? మహా యుద్ధానికి సుమతి ఎందుకు కారణమైంది? యుద్ధంలో భైరవ పాత్ర ఏమిటి? అనే ప్రశ్నలకు దర్శకుడు నాగ్ అశ్విన్ చెప్పిన సమాధానమే కల్కి.

నటీనటులు ఎలా చేశారంటే
ఈ సినిమాకు నిజమైన హీరో అమితాబ్ బచ్చన్ అని చెప్పొచ్చు. 80 సంవత్సరాల వయసులో కూడా ఈ తరహా పాత్ర పోషించడం అంటే సినిమాపై ఆయనకున్న అభిమానాన్ని, ప్రేమను చాటిచెబుతోంది. అశ్వత్థామ పాత్రలో అమితాబ్ మినహా మరెవరినీ ఊహించుకోలేం. డీఏజింగ్ తో ఆయన్ను చూపించిన విధానం కూడా అందరికీ నచ్చుతుంది. ప్రభాస్ తనలోని కామెడీ కోణాన్ని ఈ చిత్రంలో పూర్తిగా పండించాడు. తను చేసిన ఎలివేషన్స్ కూడా బాగున్నాయి. కల్కి రెండో భాగంలో డార్లింగ్ ను కర్ణగా చూపించబోతున్నారు. ఇది అందరికీ నచ్చింది. దీపికా పదుకొనే బరువైన పాత్రతో ఆకట్టుకుంది. ఆమె నటన, హావభావాలు పూర్తిగా పండాయి. కమల్ హాసన్ ఎంతో సులువుగా ఈ పాత్రను చేసినప్పటికీ ఆయనలోని విశ్వరూపాన్ని చూడాలంటే రెండో భాగం కోసం ఎదురుచూడక తప్పదు. మిగతావారంతా తమ పాత్రలతో అలరించారు.

pan india rebal star prabhas kalki 2898 ad review

సాంకేతికవర్గం పనితీరు
సినిమాకు ప్రధాన బలం డైరెక్టర్ ఆఫ్ ఫొటోగ్రఫీ. అత్యద్భుతమైన సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ ను ప్రేక్షకులకు అందించారు. సంతోష్ నారాయణన్ పాటల విషయంలో నిరాశపరిచినా నేపథ్య సంగీతాన్ని మాత్రం అదిరిపోయేలా ఇచ్చాడు. యుద్ధానికి సంబంధించిన సన్నివేశాల్లో బీజీఎం చాలా బాగుంది. హాలీవుడ్ సినిమా చూస్తున్న భావన అందరికీ కలిగింది. అలా కలిగించడంలో విజయవంతమైన వ్యక్తి దర్శకుడు నాగ్ అశ్విన్.

మన పురాణాల్లోనే చాలామంది సూపర్ హీరోలు ఉన్నారనేది నాగ్ అశ్విన్ నమ్మకం. అందుకనుగుణంగా కథను రాసుకున్నాడు. విజువల్స్ చాలా బాగున్నాయి. దర్శకుడిగా ఎక్కువ మార్కులు పడ్డాయి. ఇంకా రెండు భాగాలున్నాయి కాబట్టి చాలా ప్రశ్నలకు వాటిల్లో సమాధానం రాబోతోంది. మూడు గంటలపాటు సినిమా ఉన్నప్పటికీ విజువల్స్ అంతసేపు ప్రేక్షకుడికి బోర్ కొట్టకుండా కూర్చోబెట్టాయి. చిన్న చిన్న లోపాలున్నప్పటికీ అవి పరిగణనలోకి తీసుకోవాల్సినంత పెద్దవేమీ కాదు. తెలుగు సినీ పరిశ్రమ స్థాయిని పెంచేలా కల్కి ఉందని చెప్పొచ్చు. విజువల్స్ కోసం సినిమాను మరోసారి చూడొచ్చు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+