ఆ రెండుచోట్లా 'సలార్' భారీ డిజాస్టర్?
భారీ అంచనాలతో విడుదలైన 'సలార్' సినిమా సూపర్ డూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతోంది. మొదటి ఆరు రోజులకే ప్రపంచ వ్యాప్తంగా రూ.500 కోట్ల గ్రాస్ వసూళ్లు కొల్లగొట్టింది. విదేశాల్లో ఇప్పటికే 7 మిలియన్ డాలర్లు దాటి.. 10 మిలియన్ డాలర్ల వైపు పరుగులు తీస్తోంది. 'సలార్' సినిమాకు పోటీగా వచ్చిన షారుఖ్ ఖాన్ 'ఢంకీ' సినిమా ఇప్పటివరకు ఇండియాలో కేవలం రూ.140 కోట్ల వసూళ్లు మాత్రమే రాబట్టగలిగింది. ఈ సినిమా హిట్ అవ్వాలంటే మరో రూ.50 కోట్ల వసూళ్లు సాధించాల్సి ఉంది.
ఒకవేళ ఈ కలెక్షన్లను రాబట్టలేకపోతే 'డంకీ' డిజాస్టర్ గా మారుతుంది. మరోవైపు 'సలార్' సినిమా ఏపీ, తెలంగాణ, హిందీ బెల్టులో సూపర్ డూపర్ హిట్. కానీ కర్ణాటక, కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో మాత్రం ఎందుకనో నిలదొక్కుకోలేకపోయింది. క్రిస్మస్ ముగిసిన వెంటనే ఈ సినిమా కలెక్షన్ల పరంగా దాదాపు 50 శాతం డ్రాప్ అయినట్లు ట్రేడ్ పండితులు లెక్కేస్తున్నారు.

కేరళ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలలో 'సలార్' సినిమాకు జరిగిన ప్రీ రిలీజ్ బిజినెస్ అలా ఇలా లేదు. తీరా సినిమా విడుదలైన తర్వాత వస్తున్న వసూళ్లకు అస్సలు పొంతన ఉండటంలేదు. కర్ణాటకలో ఈ సినిమాను హోంబలే సొంతంగా విడుదల చేసింది. అక్కడ భారీ నష్టాలు రావడం ఖాయమని తేలింది. కర్ణాటకలో ఇప్పటివరకు కనీసం రూ.5 కోట్ల షేర్ కూడా రాలేదు. ఈ సినిమాను ఆ రాష్ట్ర ప్రజలు అసలు పట్టించుకోలేదు. పృథ్వీరాజ్ ఉండటంతో కేరళ రాష్ట్రంలో పరిస్థితి మెరుగ్గా ఉంది. అక్కడ బ్రేక్ ఈవెన్ అవుతుందా? అంటే చెప్పలేని పరిస్థితి ఉంది. తమిళనాడులో బ్రేక్ ఈవెన్ అవడం చాలా కష్టమని తేలిపోయింది. కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో సలార్ భారీ డిజాస్టర్ గా మిగిలిందని చెప్పవచ్చు. ఈ వార్త డార్లింగ్ అభిమానులను నిరాశకు గురిచేస్తోంది.












Click it and Unblock the Notifications