'సలార్' రేర్ ఫీట్... మొదటిసారిగా అక్కడే!
భారీ అంచనాలతో విడుదలైన 'సలార్' సినిమా సూపర్ డూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతోంది. మొదటి ఆరు రోజులకే ప్రపంచ వ్యాప్తంగా రూ.500 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు కొల్లగొట్టింది. విదేశాల్లో ఇప్పటికే 7 మిలియన్ డాలర్లు దాటి.. 10 మిలియన్ డాలర్ల వైపు పరుగులు తీస్తోంది. 'సలార్' సినిమాకు పోటీగా వచ్చిన షారుఖ్ ఖాన్ 'ఢంకీ' సినిమా ఇప్పటివరకు ఇండియాలో కేవలం రూ.140 కోట్ల వసూళ్లు మాత్రమే రాబట్టగలిగింది. ఈ సినిమా హిట్ అవ్వాలంటే మరో రూ.50 కోట్ల వసూళ్లు సాధించాల్సి ఉంది.
సంక్రాంతి వరకు భారీ సినిమాలేవీ విడుదల కావడంలేదు. ఇది ఈ చిత్రానికి అడ్వాంటేజ్ గా మారింది. లాంగ్ రన్ లో భారీ కలెక్షన్లు సాధిస్తుందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. ఈ సినిమా విడుదలైన ఆరు రోజులకే నైజాంలో బ్రేక్ ఈవెన్ అయి రికార్డు సృష్టించింది. నైజాంలో సలార్ రూ.60 కోట్ల వరకు వ్యాపారం చేసింది. మొదటి ఆరు రోజుల్లో రూ.61 కోట్ల షేర్ రాబట్టి లాభాల్లోకి వెళ్లిపోయింది.

ప్రపంచవ్యాప్తంగా నైజాంలోనే సలార్ ఎక్కువ బిజినెస్ చేసింది. అయితే ఇక్కడే మొదటిసారి బ్రేక్ ఈవెన్ అవుతుందని ఎవరూ ఊహించలేదు. నైజాంలో డార్లింగ్ ప్రభాస్ అభిమానుల బలానికి ఇది నిదర్శనమంటున్నారు. ఈ మూవీ ఇప్పటివరకు వరల్డ్ వైడ్ గా రూ.253 కోట్ల షేర్ సాధించగా, రూ.460 కోట్ల వరకు గ్రాస్ వసూళ్లు రాబట్టింది. బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే ఇంకా రూ.94 కోట్లు రాబట్టాలి. సంక్రాంతి వరకు పెద్దగా హైప్ ఉన్న సినిమాలేవీ రావట్లేదు కాబట్టి సలార్ ఈజీగా బ్రేక్ ఈవెన్ అవుతుందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. సలార్ నైజాం తర్వాత బ్రేక్ ఈవెన్ అయ్యేది ఓవర్సీస్ నుండే అని తెలుస్తోంది. ఈ సినిమా మరింత ఎక్కువగా కలెక్షన్లు వసూలు చేస్తుందని ప్రభాస్ అభిమానులు గర్వంగా చెప్పుకుంటున్నారు.












Click it and Unblock the Notifications