ఎక్కడున్నా రాజే.. ప్రభాస్ సంచలన రికార్డ్

పాన్ ఇండియా రెబల్ స్టార్ గా, డార్లింగ్ గా దేశవ్యాప్తంగా అందరి హృదయాలను ప్రభాస్ దోచున్నాడు అని చెప్పొచ్చు. అందరికీ ప్రేమను పంచుతూ, అందరిచేత ప్రేమను అందుకునే డార్లింగ్ ఖాతాలో మరో అరుదైన రికార్డ్ పడింది. సోషల్ మీడియా అకౌంట్లలో ఒకటైన ట్విటర్ (ఎక్స్) ఇప్పటివరకు ఏ భారతీయ హీరో సాధించని ఘనతను సాధించాడు. టాప్ హ్యష్ ట్యాగ్స్ ఆన్ ఎక్స్ ఇన్ ఇండియా లిస్ట్ లో ప్రభాస్ క్రేజ్ నిరూపణైంది. 2023 జనవరి 1 నుంచి 2024 జనవరి 1 మధ్యకాలంలో ఏడాది సమయం ప్రజలు ఎక్కువగా వాడిన హ్యాష్ ట్యాగ్ జాబితాను ట్విటర్ విడుదల చేసింది.

ఎంటర్ టైన్మెంట్ కేటగిరిలో టాప్-10 జాబితాలో ప్రభాస్ ఒక్కడే నిలిచాడు. ఎక్కువమంది ఉపయోగించిన హ్యాష్ ట్యాగ్స్ లో ప్రభాస్ హ్యాష్ ట్యాగ్ ఏడోస్థానంలో నిలిచింది. డార్లింగ్ రాముడిగా కనిపించిన ఆది పురుష్ మూవీకి తొమ్మిదో స్థానం దక్కింది. ఇండియన్ బాహుబలికి తిరుగులేదంటూ అభిమానులు దీన్నొక సెలబ్రేషన్ గా జరుపుకోవడమేకాదు.. కాలర్ ఎగరేస్తున్నారు. ఇంతమంది హీరోలు ఉన్నప్పటికీ ఈ అరుదైన ఫీట్ ను సాధించి ప్రభాస్ చరిత్రను సృష్టించాడు.

pan india rebal star prabhas sensational record in twitter

ఎంత ఎదిగినా ఒదిగి ఉండే ప్రభాస్ మనస్తత్వానికి, ఆయన నటనకు, ఆ కటౌట్ కు దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రియులున్నారు. ఎంతోమంది ఆయన అభిమానులుగా మారిపోయారు. ఫ్లాప్ సినిమాలు వచ్చినప్పటికీ క్రేజ్ మాత్రం కొంచెం కూడా తగ్గలేదు. బాహుబలి తర్వాత ప్రభాస్ ను అందరూ రాజులాగే చూస్తున్నారు.

ట్విటర్ లో అరుదైన రికార్డును నెలకొల్పడంతో ఎక్కడున్నా తమ హీరో రాజేనంటూ అభిమానులు సోషల్ మీడియాలో ఈ వార్తను వైరల్ చేస్తున్నారు. ప్రస్తుతం కల్కి చిత్రం చేస్తున్న డార్లింగ్ దీంతోపాటు సమాంతంగా రాజాసాబ్ చేస్తున్నాడు. దీనితర్వాత సలార్ 2 శౌర్యాంగపర్వం ప్రారంభమవుతుందా? లేదంటే సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో స్పిరిట్ ప్రారంభమవుతుందా? అనే విషయంలోనే కొస్తంత స్పష్టత రావాల్సి ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+