షారుక్ ఖాన్ కు రిటర్న్ గిఫ్ట్ పంపిన ప్రభాస్
పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ తాజా సంచలనం సలార్ వసూళ్ల పరంగా దూసుకుపోతోంది. విడుదలైన మొదటి ఆరురోజుల్లోనే రూ.500 కోట్లకుపైగా గ్రాస్ వసూళ్లు సాధించింది. అయితే నార్త్ ఇండియాలో ఈ సినిమాకు సరైన సంఖ్యలో థియేటర్లు కేటాయించలేదు. సలార్ చిత్రానికి థియేటర్లు రాకుండా షారుక్ ఖాన్ అడ్డుపడ్డాడని, అతడి మాఫియా పనిచేసిందని సోషల్ మీడియాలో డార్లింగ్ అభిమానులు కామెంట్లు పెట్టడంతోపాటు షారుక్ డంకీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
సలార్ కు థియేటర్లు కేటాయించకపోవడంతో ప్రభాస్ అభిమానులు సోషల్ మీడియాలో dunki scams ka baap, DINOSAUR CRUSHED DONKEY అనే ట్యాగ్ ను ట్రెండ్ చేస్తున్నారు. కార్పొరేట్ బుకింగ్స్ గురించి ట్వీట్ చేస్తున్నారు. మొదటిరోజు సలార్ చిత్రానికి చాలా తక్కువగానే కలెక్షన్లు వచ్చాయి. డంకీ ఫ్లాప్ కావడంతో సలార్ కు థియేటర్లు లభించాయి.

కార్పొరేట్ బుకింగ్స్ కు పాల్పడటం షారుక్ ఖాన్ కు అలవాటేనని, డంకీ చిత్రానికి ఇప్పటివరకు వచ్చినవన్నీ ఫేక్ కలెక్షన్లేనని ప్రచారం చేస్తున్నారు. డంకీకి మొదటి వారంలో రూ.250 కోట్లు రాగా, సలార్ కు మొదటి ఆరురోజుల్లో రూ.500 కోట్లకు పైగా రాబట్టింది. ఇప్పటివరకు షారుక్ ఖాన్ టీం ఏమేం చేసిందో వాటన్నింటినీ డార్లింగ్ అభిమానులు ప్రస్తావిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్లను పరిశీలిస్తే సలార్ ను అందుకోలేనంత దూరంలో డంకీ నిలబడింది. మీరు చేసిన దానికి తమ హీరో ఇచ్చిన అందమైన రిటర్న్ గిఫ్ట్ ఎలా ఉందని ప్రశ్నిస్తున్నారు. ఒకవేళ ఆ గిఫ్ట్ సరిపోలేదనుకుంటే కొద్దిరోజులు ఆగితే సలార్ కలెక్షన్లు ఇంకా పెరుగుతాయని, వాటితో డంకీని పోల్చి చూసుకోండంటూ సవాల్ విసురుతున్నారు. ఏదేమైనప్పటికీ ప్రభాస్ ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్ మాత్రం అదిరిపోయిందంటున్నారు.












Click it and Unblock the Notifications