బాలీవుడ్‌కు భారీ షాక్... ఇండియాలో నెం.1 హీరోగా ప్రభాస్
పాన్ ఇండియా రెబల్ స్టార్, డార్లింగ్ ప్రభాస్ ప్రస్తుతం ఎదురులేని విజయాలతో దూసుకుపోతున్నాడు. భారతీయ చిత్ర పరిశ్రమలో తనను అధిగమించే హీరో భవిష్యత్తులో కనపడటంలేదని అభిమానులు గర్వంగా చెప్పుకుంటున్నారు. తాజాగా విడుదలైన కల్కి చిత్రం దాదాపు రూ.1100 కోట్లు వసూలు చేసింది. డార్లింగ్ నుంచి త్వరలోనే రాజాసాబ్, స్పిరిట్, ఫౌజీ, సలార్ 2 చిత్రాలు రాబోతున్నాయి. ప్రతి ఆరునెలలకు ఒక సినిమా విడుదల చేస్తూ పాన్ ఇండియా హీరోగా తన మార్కెట్ సుస్థిరం చేసుకున్నారు.
బాలీవుడ్ కు చెందిన మీడియా సంస్థ ఆర్మాక్స్ తాజాగా జులై నెలకు సంబంధించి అత్యంత ప్రజాదరణ పొందిన హీరోల జాబితాలను ప్రకటించింది. ఈ జాబితాలో నెంబర్ వన్ స్థానంలో ప్రభాస్ నిలిచారు. ప్రభాస్ తర్వాత రెండో స్థానంలో తమిళ స్టార్ విజయ్ నిలవగా మూడో స్థానంలో షారుక్ ఖాన్, నాలుగో స్థానంలో సూపర్ స్టార్ మహేష్ బాబు, ఐదోస్థానంలో జూనియర్ ఎన్టీఆర్, ఆరో స్థానంలో అక్షయ్ కుమార్, ఏడోస్థానంలో అల్లు అర్జున్, ఎనిమిదో స్థానంలో సల్మాన్ ఖాన్, తొమ్మిదో స్థానంలో రామ్ చరణ్, పదో స్థానంలో తమిళ స్టార్ హీరో అజిత్ నిలిచారు.

మే, జూన్ నెలల్లో ఆర్మాక్స్ ప్రకటించిన జాబితాల్లో కూడా ప్రభాస్ మొదటిస్థానంలోనే నిలవడం విశేషం. దీనిపై అభిమానులు, సినీ ప్రియులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. బాలీవుడ్ హీరోలను తోసిరాజని ప్రభాస్ నెంబర్ వన్ గా అవతరించాడంటూ సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. కల్కి సినిమా విడుదల సమయం నుంచి ప్రపంచవ్యాప్తంగా డార్లింగ్ పేరు ట్రెండింగ్ లో నిలిచింది. దీన్నిచూసి తట్టుకోలేకే బాలీవుడ్ లో ఉండే చిన్న చిన్న నటులు ప్రభాస్ ను విమర్శిస్తున్నారని, సూపర్ స్టార్లను విమర్శిస్తే పెద్దవారైపోతామనే భావనలో కొంతమంది ఉంటారంటూ విమర్శకులు చురకలంటిస్తున్నారు. డార్లింగ్ పై అర్షద్ వార్సి చేసిన వ్యాఖ్యలను మంచు విష్ణు, శర్వానంద్ ఖండించిన సంగతి తెలిసిందే. ఎవరెన్ని అనుకున్నా ఎప్పటికీ భారతీయ సినీ పరిశ్రమలో ప్రభాస్ రారాజుగా వెలుగొందుతాడంటున్నారు.












Click it and Unblock the Notifications