'పాపం ప్రతాప్' ఫస్ట్ రివ్యూ: అన్న మరో సూపర్ హిట్ కొట్టాడ్రోయ్..!
మసూద, పరేషాన్, ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో లాంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకుల్ని అలరించిన యంగ్ హీరో తిరువీర్. చిన్న సినిమాలతోనే హిట్ కొట్టడం ఈ హీరో ప్రత్యేకత అని చెప్పొచ్చు. గతేడాది ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో సినిమాతో సూపర్ హిట్ అందుకున్న ఈ యంగ్ హీరో.. ఇప్పుడు తాజాగా నటించిన చిత్రం 'పాపం ప్రతాప్'.. ఈ చిత్రంలోని సరికొత్త స్టోరీ లైన్ కారణంగా ఈ మూవీపై ప్రేక్షకులకు అంచనాలు పెరిగాయి. ఈ మూవీ వేసవి కానుకగా ఏప్రిల్ 17న విడుదల కానుంది. ఈ మేరకు ఇవాళ సాయంత్రమే అక్కడక్కాడా ప్రివ్యూస్ స్టార్ట్ కానున్నాయి.
ప్రస్తుతం చిన్న సినిమాలదే హవా నడుస్తోంది. గతేడాది ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అందుకున్న సినిమాలు చాలానే ఉన్నాయి. రాజు వెడ్స్ రాంబాయి, లిటిల్ హార్ట్స్, శంభాల.. ఇలా చాలా సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీగా కలెక్షన్స్ ను నమోదు చేశాయి. అలాగే గతేడాది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో సినిమాతో సూపర్ హిట్ అందుకున్న యంగ్ హీరో తిరువీర్.. ఇప్పుడు 'పాపం ప్రతాప్' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ మూవీ ఏప్రిల్ 17న గ్రాండ్ గా విడుదల కానుంది.
పాపం ప్రతాప్ మూవీ పక్కా విలేజ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతోంది. ఈ సినిమాకు ఎస్. పీ దుర్గ నరేష్ దర్శకత్వం వహించారు. అలాగే రాకేశ్ రెడ్డి గడ్డం, రుద్రదేవ్ మాదిరెడ్డి సంయుక్తంగా నిర్మించారు. పాయల్ రాధకృష్ణ ఈ మూవీలో హీరోయిన్ గా నటిస్తోంది. ఇక ఈ మూవీ ఓటీటీ హక్కులను ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్ ఫార్మ్ ఈటీవీ విన్ కొనుగోలు చేసింది. గతేడాది లిటిల్ హార్ట్స్, రాజు వెడ్స్ రాంబాయి, అనగనగా, కానిస్టేబుల్ కనకం, AIR తదితర వరుస విజయవంతమైన సినిమాలతో అన్ని వయసుల ప్రేక్షకులను ఈ మూవీ ఆకట్టుకున్న విషయం తెలిసిందే.
ఇప్పటికే ఈ మూవీ ప్రీమియర్ షోల టికెట్ బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. హైదరాబాద్ లోని మైత్రి విమల్ 70 ఎంఎం (బాలానగర్) లో సాయంత్రం 7 గంటల 45 నిమిషాలకు, పీవీఆర్ నెక్సస్ (కూకట్పల్లి) లో 7 గంటల 40 నిమిషాలకు, పీవీఆర్ ఆర్కే సినీప్లెక్స్ (బంజారా హిల్స్) లో 7 గంటల 55 నిమిషాలకు, అలాగే ఏఎంబీ సినిమాస్ (గచ్చిబౌలి) లో రాత్రి 10 గంటల 15 నిమిషాలకు ప్రీమియర్ షోలు ప్రదర్శించనున్నారు.

సామాజిక మాధ్యమాల నుంచి వస్తున్న సమాచారం ప్రకారం.. విడాకులు కూడా కాదు.. పెళ్లయిన మూడు రోజులకే భార్య వదిలేసి వెళ్లిపోయింది.. అందు గల కారణం ఏంటి..? అనే కొత్త స్టోరీ లైన్ తో సినిమా మొత్తం సరదాగా సాగేలా దర్శకుడు ఈ మూవీని తెరకెక్కించినట్లు సమాచారం. ఎక్కడా బోర్ కొట్టకుండా హీరో తిరువీర్ తనదైన నటనతో ఆకట్టుకున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి తిరువీర్ ఖాతాలో మరో హిట్టు ఖాయమని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.












Click it and Unblock the Notifications