ఆ హీరో రాజకీయానికి పవన్ కల్యాణ్, జానీమాస్టర్ విలవిల

తెలుగు సినీ పరిశ్రమలో ప్రస్తుతం జానీ మాస్టర్ వ్యవహారం సంచలనంగా మారింది. తనను లైంగికంగా వేధిస్తున్నాడని, బలాత్కారం చేశాడంటూ లేడీ కొరియోగ్రాఫర్ శ్రేష్టి వర్మ పోలీసులకు ఫిర్యాదు చేయడమే దీనికి కారణం. ప్రస్తుతం పరారీలో ఉన్న జానీమాస్టర్ ను నార్సింగి పోలీసులు గోవాలో అరెస్ట్ చేశారనే వార్తలు వస్తున్నాయి. దీనిపై అధికారికంగా ధ్రువీకరణ రాలేదు. జానీమాస్టర్ పై కేసు పెట్టించడం వెనక పెద్ద స్టార్ హీరో ఉన్నాడంటూ సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఎన్నో సందర్భాల్లో, ఎన్నో వేదికలపై, ఎంతోమంది స్టార్ హీరోలు జానీపై ప్రశంసల జల్లు కురిపించారు.

అనుబంధం కాస్తా స్నేహంగా మారింది
దీనికి కారణం అతడు కొరియోగ్రఫీ చేసిన పాటలు సూపర్ హిట్ అవడమే కాకుండా ఆయా హీరోలకు కూడా మంచి పేరు తెచ్చిపెట్టాయి. తెలుగులో జానీ మాస్టర్ కు, ఓ స్టార్ హీరోకు మంచి అనుబంధం ఉంది. ఆ హీరో సినిమాలో కచ్చితంగా జానీ కొరియోగ్రఫీ చేసిన పాటలు ఉంటాయి. అనుబంధం కాస్తా ఇద్దరి మధ్య స్నేహంగా మారింది. ఫిలిం ఛాంబర్ కు అనుబంధంగా ఏర్పాటైన లైంగిక వేధింపుల పరిష్కారం కోసం ఓ ప్యానెల్ ఉంది. ఆ ప్యానెల్ చైర్ పర్సన్ జాన్సీ స్వయంగా ఓ విషయాన్ని వెల్లడించారు.

Pawan Kalyan and johnny master shocked by that star hero politics

మద్దతుగా ఉంటామనే హామీ ఇచ్చారు
ఓ స్టార్ హీరో తన మేనేజర్ ను జానీపై కేసు పెట్టిన లేడీ కొరియోగ్రాఫర్ వద్దకు పంపించారు. ఈ పోరాటంలో ఆమెకు మద్దతుగా ఉంటామని హామీ ఇచ్చారు. అంతేకాదు.. ఆమెకు కొరియోగ్రాఫర్ గా అవకాశం ఇస్తామనే గట్టి హామీని కూడా ఇచ్చారు. ఈ విషయాలన్నీ స్వయంగా జాన్సీనే వెల్లడించారు. దీంతో ఆ హీరో ఎవరు అనే చర్చ ఫిలింనగర్ లో జరుగుతోంది. ఈ కేసును అడ్డం పెట్టుకొని తనకు వ్యతిరేకంగా ఉన్న వ్యక్తులపై పై చేయి సాధించాలనే దృక్పథాన్ని సదరు హీరో ప్రదర్శిస్తున్నాడని, దీనికోసం రాజకీయాలు చేస్తున్నారంటూ సామాజిక మాధ్యమాల్లో చర్చలు జరుగుతున్నాయి. ఆ హీరో ఎవరు? ఎందుకు ఇలా చేస్తున్నారు? దీనికి కారణమేంటి? అతనికి ఒనగూరే లాభమేంటి? అనే ప్రశ్నలకు మాత్రం సమాధానం ఎవరికీ తెలియడంలేదు. ఆ ఒక్క హీరోకే తెలవాలి.

అవకాశాన్ని వినియోగించుకున్న స్టార్ హీరో
పవన్ కల్యాణ్ జనసేన పార్టీకి జానీమాస్టర్ వీర విధేయుడు. ఈ మధ్యే ఆ స్టార్ హీరో సినిమాకు పవన్ కల్యాణ్ అభిమానుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఈ తరుణంలో విడుదల చేయాల్సిన సినిమాను కూడా వాయిదా వేసుకున్నారు. తర్వాత సినిమాల్లో హీరోల క్యారెక్టర్లపై ఉప ముఖ్యమంత్రి హోదాలో పవన్ కల్యాణ్ కామెంట్స్ చేశారు. ఇటువంటి సంఘటనలన్నీ కలిపి జానీమాస్టర్ ను బలిచేశాయంటున్నారు. దొరికిన అవకాశాన్ని ఆ స్టార్ హీరో చక్కగా ఉపయోగించుకోవడంతో అతని రాజకీయానికి పవన్ కల్యాణ్, జానీమాస్టర్ బలయ్యారంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+