పవన్- శ్రీలీల సీన్ లీక్.. వింటేజ్ కల్యాణ్ బాబోయ్.. రెడీ అయిపోండి ఇక..

పవర్ స్టార్ పవన్ కల్యాణ్- హరీశ్ శంకర్ కాంబోలో గతంలో గబ్బర్ సింగ్ మూవీ వచ్చిన విషయం తెలిసిందే. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. చాలా ఏళ్ల తర్వాత మళ్లీ ఈ కాంబినేషన్ రిపీట్ అవుతోంది. ప్రస్తుతం హరీష్ శంకర్- పవన్ కల్యాణ్ కాంబోలో రాబోతున్న 'ఉస్తాద్ భగత్ సింగ్' మూవీ షూటింగ్ జరుపుకుంటోంది. అయితే తాజాగా ఈ మూవీ సెట్స్ నుంచి పవన్ కల్యాణ్, శ్రీలీల వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.

హరీష్ శంకర్- పవన్ కల్యాణ్ కాంబోలో రాబోతున్న మూవీ 'ఉస్తాద్ భగత్ సింగ్'. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ జరుపుకుంటోంది. అయితే తాజాగా ఈ మూవీ సెట్స్ నుంచి పవన్ కల్యాణ్, శ్రీలీల వీడియో సామాజిక మాధ్యమాల్లో ప్రత్యక్షమయ్యాయి. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఈ సీన్ లో పవన్ కల్యాణ్ వింటేజ్ లుక్ లో అదరగొడుతున్నారు. ఇందులో పవన్ సన్ గ్లాసెస్, టీ షర్ట్- జీన్స్ ధరించి చాలా స్టైలిష్ గా కనిపించారు.

Pawan Kalyan and Sreeleela s Ustad Bhagat Singh Set Video Goes Viral

ఈ మూవీ రిలీజ్ డేట్ ఇంకా ఫైనల్ కాలేదు. వచ్చే ఏడాది సమ్మర్ లో రిలీజయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక పవర్​ స్టార్​ పవన్​ కల్యాణ్​ లీడ్ రోల్ లో నటించిన సినిమా 'హరి హర వీర మల్లు' ఈ మూవీ ఈ నెల 24న విడుదల కానుంది. ఈ మేరకు విశాఖలో ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈ నెల 20 న నిర్వహించనున్నారు. ఇక ఈ మూవీ లేటెస్ట్ గా సెన్సార్ పూర్తి చేసుకుంది. సినిమా నిడివి 2 గంటల 42 నిమిషాలు ఉన్నట్లు తేలింది.

ఇక ఇటీవల ఈ సినిమా ట్రైలర్ రిలీజైంది. విడుదలైన 24 గంటల్లోనే తెలుగు వెర్షన్‌ కు 48 మిలియన్ల వ్యూస్ దక్కించుకుంది. 24 గంటల్లోనే ఈ స్థాయిలో వ్యూస్ రావడం తెలుగు సినీ చరిత్రలో ఇదే తొలిసారి కావడం విశేషం. దర్శకులు జ్యోతి కృష్ణ, క్రిష్ జాగర్లమూడి సంయుక్తంగా ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. దీనికి ఎంఎం కీరవాణి సంగీతం అందించారు.ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామాను మెగా సూర్య ప్రొడక్షన్ బ్యానర్​ పై ఎఎం రత్నం సమర్పిస్తుండగా, ఎ. దయాకర్ రావు ఈ ప్రాజెక్టును నిర్మిస్తున్నారు.

మరోవైపు పవన్ కల్యాణ్ అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్న సినిమాల్లో 'ఓజీ'కూడా ఒకటి. ఈ సినిమాను సుజీత్ తెరెక్కిస్తున్నారు. గ్యాంగ్‌స్టర్‌ యాక్షన్ నేపథ్యంలో తెరకెక్కుతుండడం కారణంగా సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ మూవీ సెప్టెంబర్ 25 న విడుదల కానుంది. ఇటీవల షూటింగ్ సైతం పూర్తిచేసుకుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+