పవన్ కళ్యాణ్ మాజీ భార్య రిక్వెస్ట్.. ప్లీజ్ సహాయం చేయండి అంటూ !
ప్రముఖ నటి, నిర్మాత, సామాజిక కార్యకర్త రేణూ దేశాయ్.. తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలే. మహిళల సాధికారత, బాలల సంక్షేమం, మూగజీవాల పరిరక్షణ కోసం ఆమె చేస్తున్న సేవలు అందరికీ తెలిసిందే. తాజాగా రేణూ దేశాయ్ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరిలో చేసిన ఓ ఎమోషనల్ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ప్లీజ్ సహాయం చేయండి అంటూ కోరడం హాట్ టాపిక్ గా మారింది.
ఏం పోస్ట్ చేశారంటే..?
విజయవాడలో ఉన్న నా మంచి ప్రజలారా, ఒక్క మనిషిగా నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను. దయచేసి నన్ను నమ్మండి. రవి గారికి విరాళం ఇవ్వండి. మీరు నా ఎన్జీవోకి ఇవ్వకపోయినా పరవాలేదు. కానీ, ఈ జంతు సంక్షేమ సంస్థకి ఖచ్చితంగా సహాయం చేయండి" అంటూ ఇన్ స్టాగ్రామ్ స్టోరీలో విజ్ఞప్తి చేశారు. అంతే కాకుండా దండం పెట్టిన ఎమోజీని సైతం మెన్షన్ చేయడం అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. రేణూ దేశాయ్ చేసిన ఈ రిక్వస్ట్ పట్ల నెటిజన్లు కూడా పాజిటివ్ గా స్పందిస్తున్నారు.

సినిమాల పరంగా..
రేణూ దేశాయ్ సినీ ప్రయాణం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పవన్ కల్యాణ్ హీరోగా నటించిన 'బద్రి' సినిమాతో టాలీవుడ్‌కి పరిచయమై, తొలి సినిమాతోనే ప్రేక్షకుల హృదయాల్లో చోటు దక్కించుకుంది. ఆ తర్వాత 'జానీ' సినిమాతో పవన్ సరసన నటించి, నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. తరువాత సినిమాలకు కొంత దూరంగా ఉన్న ఆమె, ఇటీవల రవితేజ నటించిన 'టైగర్ నాగేశ్వరరావు' సినిమాలో కీలక పాత్రలో నటిస్తూ రీ ఎంట్రీ ఇచ్చింది.
పర్సనల్ లైఫ్..
రేణూ దేశాయ్, పవన్ కళ్యాణ్ లకు 2009లో వివాహం జరిగింది. వీరిద్దరికీ అకీరా నందన్, ఆద్య అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే ఇద్దరి మధ్య రిలేషన్‌లో మనస్పర్థలు రావడంతో 2012లో విడాకులు తీసుకున్నారు. పవన్ తో విడాకుల తర్వాత ఒంటరి గానే ఉంటున్న ఆమె.. రెండేళ్ల క్రితమే టాలీవుడ్‌లోకి రీ ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం సినిమాలు ఏం చేయకపోయినా.. సోషల్ మీడియాలో యాక్టివ్‌గానే ఉంటోంది. పలు అంశాలపై స్పందిస్తూ వార్తల్లో నిలుస్తున్నారు.












Click it and Unblock the Notifications