మెగా దర్శకుడి ఇంట్లో తీవ్ర విషాదం.. పవన్ కల్యాణ్ ఎమోషనల్ పోస్ట్
టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు మెహర్ రమేశ్ గురించి తెలిసే ఉంటుంది కదా.. ప్రభాస్ బిల్లా సినిమాతో మంచి పేరు తెచ్చుకున్నా.. ఆ తర్వాత తీసిన కంత్రీ, శక్తి, షాడో, భోళా శంకర్ సినిమాలు డిజాస్టర్ గా మిగిలాయి. కానీ ఇండస్ట్రీలో ఇప్పటికీ మెహర్ రమేశ్ సత్సంబంధాలు కలిగి ఉన్నారు. ఆయనకు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తోనూ సాన్నిహిత్యం ఎక్కువే. అయితే కొద్దిసేపటిక్రితమే ఆయన సోదరి మృతి చెందారు. దీంతో మెహర్ రమేశ్ తీవ్ర విషాదంలోకి వెళ్లిపోయారు.

మెహర్ రమేశ్ సోదరి మాదాసు సత్యవతి..గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధ పడుతున్నారు. ఈ క్రమంలో ఇవాళ హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కొద్దిసేపటి క్రితమే కన్నుమూశారు. సోదరి మృతితో మెహర్ రమేశ్ శోకసంద్రంలో మునిగిపోయారు. అయితే సత్యవతి మృతిపై ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తన చిన్నతనంలో మెహర్ కుటుంబం విజయవాడలోని మాచవరం ప్రాంతంలో నివసించేదని, పాఠశాల రోజుల్లో వేసవి సెలవులకు వాళ్ల ఇంటికి వెళ్లేవాళ్లమని పవన్ కల్యాణ్ గుర్తు చేసుకున్నారు. సత్యవతి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్టు తెలిపారు. ఈ మేరకు సామాజిక మాధ్యమమైన ఎక్స్ ద్వారా ప్రకటన విడుదల చేశారు.
దర్శకులు శ్రీ @MeherRamesh గారి సోదరి శ్రీమతి మాదాసు సత్యవతి గారి మరణవార్త తీవ్ర బాధాకరం. వారి పవిత్రాత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను.
— Deputy CMO, Andhra Pradesh (@APDeputyCMO) March 27, 2025
- @PawanKalyan pic.twitter.com/QjShqIyp6z
మెహర్ రమేశ్ స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ. ఆయన తండ్రి నగరంలో పోలీస్ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేశారు. రమేశ్ మాచవరంలో పాఠశాల విద్యను పూర్తి చేశారు. గుడివాడ సమీపంలోని గుడ్లవల్లేరులో సివిల్ ఇంజనీరింగ్‌లో డిప్లొమా చేశారు. డైరెక్టర్ అవ్వడానికి ముందు మెహర్ రమేశ్ 'బాబీ' సినిమాలో ఓ సహాయక పాత్రను పోషించాడు. ఆ తర్వాత కన్నడ చిత్రం 'వీర కన్నడిగ' (2004 తో దర్శకుడిగా మారారు. ఇది తెలుగులో 'ఆంధ్రావాలా' (2004)గా రిలీజైంది. కన్నడలో అతని రెండవ చిత్రం 'అజయ్' (2006). ఇది మహేష్ 'ఒక్కడు'కు రీమేక్ గా తెరకెక్కింది. ఈ రెండు సినిమాలు కన్నడలో సూపర్ హిట్ అయ్యాయి.












Click it and Unblock the Notifications