'మురారి' రికార్డును బద్ధలు కొట్టిన 'గబ్బర్ సింగ్'?

తెలుగులోని హీరోలంతా ఏడాదికో లేదంటే మూడు సంవత్సరాలకో సినిమా చేస్తున్నారు. దీంతో అభిమానుల కోసం వారు గతంలో చేసిన సినిమాలనే రీరిలీజ్ చేస్తూ వారిని సంతోషపెడుతున్నారు. ఈ ఏడాది మహేష్ బాబు నటించిన మురారి రీరిలీజై సంచలన కలెక్షన్లు రాబట్టింది. అలాగే మెగాస్టార్ చిరంజీవి నటించిన ఇంద్ర సినిమాకు కూడా కలెక్షన్లు భారీగానే వచ్చాయి. వచ్చేనెల రెండోతేదీన పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పుట్టినరోజు ఉండటంతో ఆ సందర్భాన్ని పురస్కరించుకొని 2012లో ఆయన నటించిన గబ్బర్ సింగ్ సినిమాను రీరిలీజ్ చేస్తున్నారు.

పవన్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్
పవన్ కల్యాణ్ కెరీర్ లో గబ్బర్ సింగ్ బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. తాజాగా ఈ సినిమా మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. పవన్ కల్యాణ్ ప్రస్తుతం ఏపీ ఉప ముఖ్యమంత్రిగా ఉండటంతో ఆయన రేంజ్ మరోస్థాయిలో ఉంది. గబ్బర్ సింగ్ సినిమాకు సంబంధించి బుక్ మై షోలో 27వేల టికెట్లు అమ్ముడుపోయాయి. అడ్వాన్స్ బుకింగ్స్ విషయంలో ఈ సినిమా గతంలో విడుదలైన మురారి, సింహాద్రి, ఇంద్ర చిత్రాల రికార్డులను బద్దలు కొట్టింది. మహేష్ బాబు మురారి సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ కింద రూ.3.46 కోట్లు రాబట్టగా, గబ్బర్ సింగ్ రూ.4 కోట్లు రాబట్టింది.

Pawan Kalyan s Gabbar Singh has broken the record of Mahesh Babu Murari s film

విదేశాల్లో సత్తా చాటుతున్న గబ్బర్
వీటిల్లో ఒక్క కర్ణాటకలోనే రూ.29.6 లక్షలు వచ్చాయి. ఏపీ, తెలంగాణతోపాటు విదేశాల్లో కూడా గబ్బర్ సింగ్ సత్తా చాటుతోంది. నైజాంలో ఈ సినిమాను భారీస్థాయిలో విడుదల చేస్తున్నారు. సినిమా విడుదల రోజు, లాంగ్ రన్ లో మరెన్ని రికార్డులు సృష్టిస్తుందో అని అభిమానులు ఆశగా ఉన్నారు. ఇటీవల విడుదలైన సినిమాల్లో మురారి అత్యధిక కలెక్షన్లు సాధించింది. ఈ చిత్రం రికార్డును ఎలాగైనా బద్ధలు కొడతామంటున్నారు పవన్ కల్యాణ్ అభిమానులు. చూడాలి వీరి కోరిక ఎంతమేరకు నెరవేరుతుందో. హరీష్ శంకర్ దర్శకత్వంలో బండ్ల గణేష్ ఈ చిత్రాన్ని నిర్మించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+