ఈసారి పక్కా అంటున్న హరిహర వీరమల్లు టీం.. రిలీజ్ డేట్ అనౌన్స్ !
ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒక వైపు రాజకీయాలు, మరోవైపు సినిమాలు అంటూ జోడు గుర్రాలను స్వారీ చేస్తున్నారు. ప్రజా సేవే లక్ష్యంగా దూసుకుపోతున్న ఆయన వీలు కుదిరినప్పుడల్లా కమిటెడ్ అయిన సినిమాలను కంప్లీట్ చేసే పనిలో ఉంటున్నారు. ప్రస్తుతం పవన్ చేతిలో పలు సినిమాలు ఉండగా వాటిలో హరిహర వీరమల్లు కూడా ఒకటి. భారీ బడ్జెట్ తో పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని మొదట్లో క్రిష్ దర్శకత్వం వహించగా పలు కారణాలతో ఆయన చిత్రం నుంచి వైదొలిగారు. ప్రస్తుతం ఈ మూవీకి జ్యోతి కృష్ణ దర్శకత్వం వహిస్తుండగా.. షూటింగ్ చివరి దశకు చేరుకుంది.
ఇప్పటికే ఈ సినిమా రిలీజ్ కావాల్సి ఉండగా.. పవన్ పొలిటికల్ లైఫ్ కారణంగా పోస్ట్ పోన్ అవుతూ వచ్చింది. ఈ సినిమా మార్చి 28న థియేటర్లకు తీసుకువస్తామని మేకర్స్ ప్రకటించారు. దీంతో పవర్ స్టార్ ఫ్యాన్స్, ఇటూ మెగా అభిమానుల సందడి మొదలైంది. అయితే రిలీజ్ డేట్ దగ్గర పడుతున్నా కానీ మూవీ యూనిట్ సైలెంట్ గా ఉండడంతో సినిమా రిలీజ్ మళ్లీ పోస్ట్ పోన్ అయ్యిందని అంతా భావించారు.

ఇక ఇప్పుడు ఇదే విషయాన్ని నిజం చేస్తూ మూవీ యూనిట్ అఫిషియల్ గా అనౌన్స్ చేసింది. మే 9న 'హరి హర వీరమల్లు' మూవీని రిలీజ్ చేస్తున్నట్టు తాజాగా మేకర్స్ వెల్లడించారు. ఈమేరకు మూవీ టీం కొత్త పోస్టర్ రిలీజ్ చేసింది. ఈ పోస్టర్ లో పవన్ గుర్రంపై స్వారీ చేస్తూ ఉండగా.. ఆ వెనుక హీరోయిన్ నిధి అగర్వాల్‌తో పాటు మరో కీలక పాత్రలు సునీల్, నాజర్, కబీర్ సింగ్, సుబ్బరాజు కనిపించారు.
ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
నిర్మాత ఏఎం రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్ పతాకంపై దయాకర్ రావు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఆస్కార్ అవార్డు గ్రహిత ఎంఎం కీరవాణి ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. మరోవైపు ఇప్పటికే రిలీజ్ అయిన ఈ సినిమా ట్రైలర్, పోస్టర్స్ సినిమాపై బజ్ ను పెంచాయి. అలానే మూవీ నుంచి రిలీజ్ అయిన రెండు సాంగ్స్ చాట్ బస్టర్ లుగా మారాయి.
The battle is set, and the fight for JUSTICE and DHARMA will be unstoppable! ⚔️🔥#HariHaraVeeraMallu charges into battle at breakneck speed, and NOTHING will alter the hunt this time.
— Hari Hara Veera Mallu (@HHVMFilm) March 14, 2025
A saga of valor is all set to ignite the screens on May 9th, 2025 ❤️🔥💥
A POWER-PACKED… pic.twitter.com/BOE4mmmbXY












Click it and Unblock the Notifications