పవన్ కళ్యాణ్ "హరిహర వీరమల్లు" నిర్మాతకు సీరియస్..

చిత్రపరిశ్రమలోని ప్రముఖ నిర్మాతల్లో ఏఎం రత్నం కూడా ఒకరు. ఇప్పటికే తెలుగులో కర్తవ్యం, భారతీయుడు, స్నేహం కోసం, ఖుషి లాంటి సినిమాలను నిర్మించి భారీ విజయాలు అందుకున్నారు. ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో "హరిహర వీరమల్లు" సినిమా చేస్తున్నారు. పాన్ ఇండియా లెవెల్లో భారీ బడ్జెట్ తో ఈ మూవీని తెరకెక్కించారు. ఈ చిత్రాన్ని జూన్ 12న రిలీజ్ చేయనున్నట్టు ఇప్పటికే అనౌన్స్ కూడా చేశారు. అయితే ఇప్పుడు అనుకోని రీతిలో రత్నం తీవ్ర అస్వస్థతతో ఆస్పత్రిలో చేరడం సినీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.

ఏఎం రత్నం తీవ్రమైన జ్వరంతో అస్వస్థకు గురైనట్లు తెలుస్తుంది. జ్వరం ఎక్కువగా ఉండడంతో ఆయన కుటుంబ సభ్యులు ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్చారని.. అబ్జర్వేషన్ లోంచి వైద్యులు చికిత్స అందిస్తున్నారని సమాచారం. ఆయన ఆరోగ్యం గురించి పూర్తి వివరాలు త్వరలోనే తెలిసే అవకాశం ఉంది. ప్రత్యేకమైన వైద్య బృందం నేత్రుత్వంలో ఆయనకు చికిత్స అందిస్తున్నారని చెబుతున్నారు. ఇప్పటికే పలువురు ప్రముఖులు సైతం ఆసుపత్రికి వెళ్లి రత్నంను పరామర్శిస్తున్నారు. కొద్దిసేపట్లో డాక్టర్లు హెల్త్ బులిటెన్ ప్రకటించే ఛాన్స్ ఉందంటున్నారు.

pawan-kalyan-harihara-veeramallu-movie-producer-am-rathnam-hospitalized

'హరి హర వీరమల్లు' మూవీకి జ్యోతి కృష్ణ దర్శకత్వం వహిస్తుండగా.. తొలి భాగం హరి హర వీరమల్లు పార్ట్‌ 1 : స్వార్డ్‌ వర్సెస్‌ స్పిరిట్‌ పేరుతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రాన్ని మొదట్లో క్రిష్ దర్శకత్వం వహించగా పలు కారణాలతో ఆయన చిత్రం నుంచి వైదొలిగారు. ఈ చిత్రంలో హీరోయిన్‌ గా నిధి అగర్వాల్‌ నటిస్తుండగా.. కీలక పాత్రలలో అనుపమ్‌ఖేర్‌, బాబీ దేవోల్‌, సునీల్‌, నాజర్‌, కబీర్‌ సింగ్‌, సుబ్బరాజు, నోరా ఫతేహి, విక్రమ్‌ జీత్‌, జిషుసేన్‌ గుప్త నటిస్తున్నారు. అలానే ఆస్కార్‌ అవార్డు గ్రహిత ఎంఎం కీరవాణి ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో ఈ మూవీ విడుదల కానుంది.

సినిమా ప్రమోషన్స్ లో భాగంగా హైదరాబాద్‌తో పాటు తిరుపతి, వారణాసిల్లో గ్రాండ్ ఈవెంట్లను నిర్వహించేందుకు ప్లాన్ చేస్తోంది. పవిత్ర శైవక్షేత్రంగా పేరొందిన వారణాసిలో జరిగే స్పెషల్ ఈవెంట్‌కు ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ను ముఖ్య అతిథిగా ఆహ్వానించే ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం. పవన్ కళ్యాణ్‌కి బీజేపీతో ఉన్న సత్సంబంధాలు రీత్యా యోగి హాజరు అయ్యే అవకాశముందని భావిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+