మంత్రి అయిన తర్వాత ఆ విషయాన్ని మరిచిపోయిన పవన్ కల్యాణ్?
సినిమాల్లో పవర్ స్టార్ కాస్తా రాజకీయాల్లో కూడా పవర్ స్టార్ అయ్యారు. తన మనసుకు నచ్చినవి, తాను చేయగలిగినవి, ప్రజలకు మేలు కలిగేవి.. కలిగించేవి ఏవి అని ఆలోచించి శాఖలను తీసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా పర్యటన చేసిన సమయంలో తెలుసుకున్న సమస్యలను పరిష్కరించేందుకు ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కల్యాణ్ అడుగులు ముందుకు వేస్తున్నారు. పిఠాపురం నియోజకవర్గం నుంచి 70వేల పైచిలుకు మెజారిటీతో ఘనవిజయం సాధించిన అనంతరం మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. మంచి ముహూర్తం చూసుకొని బాధ్యతలు స్వీకరించబోతున్నారు.
నిర్మలమైన మనసుతో..
సభల్లో, సమావేశాల్లో మాట్లాడేటప్పుడు ఎంతో ఆవేశంగా మాట్లాడటమేకాదు.. కొన్నిసార్లు భావోద్వేగానికి గురవుతుంటారు. అభిమానులతో మాట్లాడే సమయంలో కూడా వారిపై గట్టిగా అరిచిన సందర్భాలున్నాయి. అయితే ఆ అరవడం అనేది ఇంట్లో చిన్నపిల్లలను ఎలా మందలిస్తామో అలాగే ఉంటుంది. అంతేకానీ వారిపై ప్రత్యేకంగా పగ, ప్రతీకారాలు లేని నిర్మలనమైన మనసు ఆయనది. మంత్రి అయిన తర్వాత సినిమాలకు దూరమవుతున్నారనే బాధలో అభిమానులున్నప్పటికీ మంత్రిగా చూసుకొని ఆనందపడుతున్నారు. పిఠాపురం నియోజకవర్గం నుంచి ఎప్పుడైతే పవన్ విజయం సాధించారో అప్పటి నుంచి ఆయన చాలా సౌమ్యంగా మారిపోయారు. ఎక్కడా ఆవేశంగా మాట్లాడటంలేదు. జాగ్రత్తగా గమనిస్తే ఈ విషయం స్పష్టంగా అర్థమవుతుంది.

దూకుడు లేకపోతే ఎలా?
చాలా నెమ్మదిగా మాట్లాడుతున్నారు. ఎంతో సౌమ్యంగా ఉంటున్నారు. తనను ముప్పుతిప్పలు పెట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై కూడా అరవడంలేదు. ఎంతో శాంతంగా ఉంటున్నారు. పగలు, ప్రతీకారాలు తీర్చుకునేవారిమి తాము కాదంటున్నారు. కేవలం ప్రజలకు మంచి చేయడం, వారిని అభివృద్ధి పరచడం అనేదే తమ ప్రధాన బాధ్యత అంటున్నారు. ఒక్కసారిగా పవన్ దూకుడు తగ్గిపోయింది. దీనికి కారణం ఎమ్మెల్యేగా గెలుపొంది ఉప ముఖ్యమంత్రి అవడమేనా? లేదంటే మరేదైనా కారణం ఉందా? అని అభిమానులు చర్చించుకుంటున్నారు. అయితే పవన్ కల్యాణ్ అంత నెమ్మది, శాంతంగా, సౌమ్యంగా ఉండటం ఎవరికీ నచ్చడంలేదు. ఎందుకంటే ఆయన్ని ప్రజలకు దగ్గర చేసిందే ఆ దూకుడు, అగ్రెసివ్ నెస్. అలాంటిది వాటిని వదిలేసుకుంటే ఎలా? అని ప్రశ్నిస్తున్నారు. అయితే రాజకీయాల్లోకి ప్రవేశించి రాష్ట్రానికి మంత్రి అయిన తర్వాత అన్నివర్గాల ప్రజలకు దగ్గరవ్వాలి. అలా అవ్వాలంటే శాంతంగా, సౌమ్యంగా ఉండటమే సరైన నిర్ణయమని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.












Click it and Unblock the Notifications