కెరీర్‌లో ఫైనల్ సినిమాను ఖరారు చేసిన పవన్‌కల్యాణ్

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు. ఈ హోదాలో ఐదు శాఖలను సమర్థవంతంగా నిర్వర్తిస్తున్నారు. జనసేన పార్టీ అధ్యక్షుడనే సంగతి తెలిసిందే. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసిన 21 స్థానాల్లోను ఆ పార్టీ విజయం సాధించి సంచలనం సృష్టించింది. ఆ సమయానికే పవన్ హరిహర వీరమల్లు, ఓజీ సినిమాల షూటింగ్ సగం పూర్తిచేశారు. ఈ రెండు సినిమాల తర్వాత హరీష్ శంకర్ దర్శకత్వంలో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా చేయాలి. హరిహర వీరమల్లు సినిమాను ఈనెల 30వ తేదీన విడుదల చేయబోతున్నారు. దర్శకుడు క్రిష్ మధ్యలో తప్పుకోగా మిగిలిన భాగాన్ని ఏఎం రత్నం తనయుడు జ్యోతికృష్ణ పూర్తిచేశారు.

సెప్టెంబరులో ఓజీ విడుదవుతుంది
ఈ సినిమా విడుదలైన తర్వాత సెప్టెంబరులో ఓజీని విడుదల చేసే యోచనలో ఉన్నారు. ఈ సినిమా దాదాపు 70 శాతం షూటింగ్ పూర్తిచేసుకుంది. దీనికి కూడా కాల్షీట్లు కేటాయించి ఉస్తాద్ భగత్ సింగ్ చేయాలనే ఆలోచనలో పవన్ ఉన్నారు. ఈ సినిమాతో సినీ పరిశ్రమ నుంచి వైదొలగనున్నారు. ఈ సినిమా, ఈ దర్శకుడే పవన్ కు చివరి సినిమా, చివరి దర్శకుడు కానున్నారు. తనకో సినిమా చేసిపెట్టాలని ఇటీవలే జనసేనలో చేరిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి కోరుతున్నారుకానీ అది సాధ్యమయ్యేలా లేదు. ఉస్తాద్ భగత్ సింగ్ పవర్ స్టార్ చివరి సినిమా అవబోతోంది.

Pawan Kalyan has finalized the final film in his career

గుడ్ బై చెప్పేసినట్లే!
రాజకీయంగా చాలా బిజీగా ఉండటంతోపాటు త్వరలోనే నియోజకవర్గాల పునర్విభజన కూడా ఉంటుంది. సనాతన ధర్మంపై ఆయన దక్షిణాది రాష్ట్రాల్లోని ప్రముఖ దేవాలయాను సందర్శించారు. భవిష్యత్తులో కూడా ఇదే తరహాలో మరికొన్ని పుణ్యక్షేత్రాలను సందర్శించనున్నారు. పూర్తిగా రాజకీయాలపై దృష్టిపెట్టి రాబోయే ఎన్నికల్లో కూడా కూటమి గెలుపు కోసం కృషిచేయాలని భావిస్తున్నారు. ఇటువంటి తరుణంలో సినిమాలు చేయడానికి ఏమాత్రం ఖాళీ లేకపోవడంతో దాదాపుగా ఆయన చిత్ర పరిశ్రమకు గుడ్ బై చెప్పేసినట్లే అని రాజకీయ విశ్లేషకులు, సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+