'హరిహర వీరమల్లు' ఓవర్సీస్ రివ్యూ.. బొమ్మ బ్లాక్ బస్టరే!
ఏపీ ఉప ముఖ్యమంత్రి, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కథానాయకుడిగా నటిస్తున్న తొలి పాన్ ఇండియా సినిమా హరిహర వీరమల్లు. ఈ నెల 24వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. ఐదు సంవత్సరాల క్రితం షూటింగ్ ప్రారంభించుకున్న ఈ సినిమా చివరకు ఎలాగోలా విడుదల స్టేజీకి చేరుకుంది. ఇంత ఆలస్యం జరగడంతో అభిమానులెవరూ దీనిపై ఆసక్తి చూపించలేదు. పవన్ కల్యాణ్ కాల్షీట్లు ఇవ్వడం ఆలస్యం అవుతుండటంతో దర్శకుడు క్రిష్ 80 శాతం చిత్రీకరణ పూర్తయిన తర్వాత సినిమా నుంచి తప్పుకున్నారు. చివరలో మిగిలిపోయిన షూటింగ్ ను జ్యోతికృష్ణ పూర్తిచేశారు.
సినిమాలో సీన్లు అదిరిపోయాయి
ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ కూడా విజయవంతమైంది. ఈ సినిమా ను ఓవర్సీస్ లో కొంతమంది ప్రముఖులకు ప్రత్యేక షో వేసి చూపించారు. చూసినవారంతా సినిమా అద్భుతంగా ఉందని చెప్పినట్లు తెలుస్తోంది. వారినుంచి వచ్చిన స్పందన అదిరిపోయిందని, సినిమా ఇంత బాగుంటుందని తాము అనుకోలేదని, వీరమల్లు ఆలస్యం కాకుండా ఉంటే దీనిపై హైప్ ఒక రేంజ్ లో ఉండేదన్నారని తెలుస్తోంది. సినిమా మొదటి భాగంలో ఉన్న మూడు యాక్షన్ సన్నివేశాలు అదిరిపోయాయని, ఫ్యాన్స్ కు ఈ సినిమా ఒక విజువల్ ఫీస్ట్ లా నిలిచిపోతుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇంటర్వెల్ చాలా బాగుందని, ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ ఒకరకంగా ట్రెండ్ సెట్ చేస్తాయంటున్నారు.

పాజిటివ్ ఎనర్జీతో బయటకు వస్తారు
ఇంతకు ముందు సెన్సార్ సభ్యులు కూడా ఈ సినిమాకు సంబంధించి మంచి పాజిటివ్ రివ్యూ ఇచ్చారు. రెండో భాగం ప్రారంభంలో స్క్రీన్ ప్లే కాస్తంత లాగినట్లు అనిపించిందని, అయితే దాన్ని కూడా ఎక్కడా విసుగనిపించకుండా ప్రేక్షకులను ఆకట్టుకునేలా తీయడంలో జ్యోతికృష్ణ విజయవంతమయ్యాడంటున్నారు. సినిమా చూసినవారంతా ఒక పాజిటివ్ ఎనర్జీతో బయటకు వస్తారని, కుటుంబ ప్రేక్షకులకు సినిమా కచ్చితంగా నచ్చుతుందని, ఒకసారి ప్రేక్షకులంతా థియేటర్లకు రావడం ప్రారంభమైతే ఈ సినిమా లాంగ్ రన్ ఎంతవరకు వెళ్లి ఆగుతుందో తెలియకుండా ఉందని అంటున్నారు. అంతగా ఓవర్సీస్ నుంచి కూడా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది.












Click it and Unblock the Notifications