నేను రెడీ.. "OG 2" నుంచి అదిరిపోయే అప్డేట్ !!
పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన "ఓజీ" టాలీవుడ్ బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. పవన్ గ్యాంగ్‌స్టర్‌గా కనిపించిన ఈ చిత్రం భారీ అంచనాల మధ్య విడుదలై సెన్సేషనల్ విజయాన్ని అందుకుంది. మొదటి షో నుంచే బ్లాక్‌బస్టర్ టాక్ తెచ్చుకున్న ఈ మూవీ.. పవన్ కళ్యాణ్‌ను ఎప్పటినుంచో ఎలా చూడాలనుకుంటున్నారో, అలానే చూపించారని ఫ్యాన్స్ ప్రశంసలు అందుకుంది. ఈ చిత్రానికి సుజీత్ దర్శకత్వం వహించగా.. D.V.V. దానయ్య భారీ బడ్జెట్‌తో నిర్మించారు.
అలానే పవన్ సరసన ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్‌గా నటించగా.. బాలీవుడ్ స్టార్ ఇమ్రాన్ హష్మీ విలన్‌గా తన పెర్ఫార్మెన్స్‌తో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. తమన్ అందించిన మ్యూజిక్ సినిమాకు మరో పెద్ద ప్లస్ అని చెప్పాలి. అలాగే ప్రకాష్ రాజ్, శ్రియా రెడ్డి, శుభలేఖ సుధాకర్ వంటి నటులు కీలక పాత్రల్లో మెప్పించారు. కాగా ఈ సినిమా సీక్వెల్ ఉంటుందని క్లైమాక్స్ లో ప్రకటించిన విషయం తెలిసిందే.

కాగా ఈ సినిమా సెన్సేషనల్ హిట్ సాధించడంతో పార్ట్ 2 కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు లేటెస్ట్ గా ఈ సీక్వెల్ కి "ఓజస్ గంభీర - రాంపేజ్ బిగిన్స్" అనే టైటిల్ తో పార్ట్ 2 పనులు మొదలు పెట్టినట్టు సమాచారం. ఈ భారీ ప్రాజెక్టును పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయని చెబుతున్నారు. మొదటి భాగం హిట్ కావడంతో సీక్వెల్‌ను అంతకు మించిన భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారని సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది. ఈ సినిమా కథ మొదటి భాగానికి ముందు జరిగిన సంఘటనలపై ఆధారపడి ఉంటుందని తెలుస్తోంది.
ఈ క్రమంలోనే లేటెస్ట్ గా ఈ సినిమా పనులు ప్రారంభమైనట్లు తెలుపుతూ చిత్రబృందం స్పెషల్ వీడియో విడుదల చేసింది (OG 2 Update). 'గంభీర కథ సిద్ధమవుతోంది. తుపాను రావడానికి ముందు.. నిశ్శబ్దం ఉంటుంది' అని రాసుకొచ్చింది. పవన్, సుజీత్ స్టోరీ గురించి చర్చించుకుంటున్న ఈ వీడియోలో 'నేను రెడీ..' అని పవన్ (Pawan Kalyan) చెప్పడం ప్రస్తుతం నెటిజన్‌లను ఆకర్షిస్తోంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Before the storm arrives... there's a moment of silence.
— Pawan Kalyan Creative Works (@PKCWoffl) June 25, 2026
The untold story of Gambheera is ready to unfold.
Director @SujeethSign and @PawanKalyan Garu reunite under Pawan Kalyan Creative Works to expand the #OGUniverse saga 🌋#OG2 pic.twitter.com/pDzTwHJ6zH












Click it and Unblock the Notifications