పవన్ కళ్యాణ్‌ని నిండాముంచిన హరీష్ శంకర్..
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ "ఉస్తాద్ భగత్ సింగ్" భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చింది. హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో శ్రీలీల, రాశీఖన్నా కథానాయికలుగా నటించారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. గతంలో పవన్ - హరీష్ కాంబోలో వచ్చిన "గబ్బర్ సింగ్" లెవెల్లో హిట్ కొడుతుందని భావించగా.. ఆశించిన స్థాయిలో కలెక్షన్స్ మాత్రం రాబట్టలేకపోతున్నట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
అటు దేశీయంగా ఇటు విదేశాల్లోనూ అంచనాలను అందుకోలేక 100 కోట్ల క్లబ్‌ను చేరుకోలేకపోయిందని టాక్ వినిపిస్తుంది. పోస్ట్-కోవిడ్ శకంలో పవన్ కళ్యాణ్ అత్యల్ప విదేశీ వసూళ్లు సాధించిన చిత్రంగా నిలవనుందని కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఈ టాలీవుడ్ యాక్షన్ డ్రామా 12వ రోజున 35 లక్షలు మాత్రమే సేకరించింది. సక్నిల్క్ ప్రకారం, భారత బాక్స్ ఆఫీస్ నికర వసూళ్లు 70.29 కోట్లు కాగా, స్థూల వసూళ్లు 82.94 కోట్లు. విదేశాల్లో 11.78 కోట్లు సాధించగా, ప్రపంచవ్యాప్తంగా 94.72 కోట్ల స్థూల వసూళ్లతో సరిపెట్టుకుందని స్పష్టం చేసింది.

అలానే విదేశాల్లో 11.78 కోట్ల వసూళ్లతో 'ఉస్తాద్ భగత్ సింగ్' పోస్ట్-కోవిడ్ శకంలో పవన్ కళ్యాణ్ సినిమాలలో అత్యల్పంగా నిలిచింది. ఇది సుమారు 12 కోట్ల లైఫ్‌టైమ్ కలెక్షన్లను సాధించగలదని అభిప్రాయం వ్యక్తం అవుతోంది. అంతే కాకుండా పవన్ డిజాస్టర్ మూవీ 'హరి హర వీర మల్లు' (14.5 కోట్లు) కంటే కూడా తక్కువ వసూళ్లతో థియేట్రికల్ రన్‌ను ముగిస్తుందని అంటున్నారు.
150 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ టాలీవుడ్ యాక్షన్ డ్రామా, భారత బాక్స్ ఆఫీస్‌లో 70.29 కోట్ల నికర వసూళ్లను రాబట్టింది. 12 రోజుల్లో కేవలం 46.86% బడ్జెట్‌ను రికవరీ చేయగా, లైఫ్‌టైమ్ 75-80 కోట్ల నికర వసూళ్లకు పరిమితం కావచ్చు. పవన్ పోస్ట్-కోవిడ్ విదేశీ చిత్రాలు 'దే కాల్ హిమ్ ఓజీ' 65.25 కోట్లు, 'భీమ్లా నాయక్' 28 కోట్లు, 'బ్రో' 16.8 కోట్లు వసూలు చేశాయి. ఈ జాబితాలో 'ఉస్తాద్ భగత్ సింగ్' (11.78 కోట్లు) చివరి స్థానంలో నిలిచింది.
పండగ సీజన్‌ను టార్గెట్ చేస్తూ విడుదలైన ఈ చిత్రం, అభిమానులకు మాస్ జాతరలా అనిపించినా, కంటెంట్ పరంగా మాత్రం కొత్తదనం లేకపోవడం మైనస్‌గా మారింది. ముఖ్యంగా రొటీన్ కథనం, పాత తరహా డైలాగులు, ప్రిడిక్టబుల్ ట్విస్టులు ప్రేక్షకులను పూర్తిగా మెప్పించలేకపోయాయి. ఇదే సమయంలో బాలీవుడ్ చిత్రం ధురందర్ 2 పోటీగా నిలవడం ఈ సినిమాకు పెద్ద దెబ్బగా మారింది. మొత్తానికి ఓజీ సినిమాతో హిట్ ట్రాక్ లోకి వచ్చిన పవన్ ని.. హరీష్ శంకర్ నిండా ముంచేశారని పలువురు కామెంట్స్ చేస్తున్నారు.












Click it and Unblock the Notifications