పుష్ప2 లో భాగం కాబోతోన్న పవన్ కల్యాణ్?

ఏపీలో ఎన్నికలు జరుగుతుండటంతో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పూర్తి బిజీగా ఉన్నారు. పిఠాపురం నియోజకవర్గం నుంచి బరిలోకి దిగారు. కూటమి తరఫున ఉధృతంగా ప్రచారం చేస్తున్నారు. ఎన్నికలు ముగిసిన తర్వాత తను నటిస్తున్న సినిమాల షూటింగ్స్ ను వేగవంతం చేస్తారు. హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్, ఓజీతోపాటు మరో సినిమా కూడా చేయబోతున్నారంటున్నారు. తాజాగా మరోవార్త బయటకు వచ్చింది. అల్లు అర్జున్ కథానాయకుడిగా నటిస్తున్న పుష్ప2 చిత్రంలో పవన్ కల్యాణ్ కూడా భాగం కాబోతున్నారనేది ఆ వార్త సారాంశం.

సుకుమార్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న పుష్ప2 పై అంచనాలు భారీగా ఉన్నాయి. రూ.400 కోట్ల బడ్జెట్ తో రూపొందుతోన్న ఈ సినిమా క్లిక్ అయితే రూ.వెయ్యి కోట్ల వసూళ్లు రాబడుతుందని అంచనా వేస్తున్నారు. గతంలో పవన్ కల్యాణ్, అల్లు అర్జున్ అభిమానుల మధ్య వైరం కొనసాగేది. వీరిద్దరి అభిమానులు సోషల్ మీడియాలో కూడా ఒకరిపై మరొకరు వ్యతిరేక వ్యాఖ్యలు చేసుకునేవారు. తాజాగా దర్శకుడు సుకుమార్ పవన్ కల్యాణ్ తో పుష్ప2 సినిమాకు వాయిస్ ఓవర్ ఇప్పించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.

pawan kalyan voice over for allu arjun and sukumar combination move pushpa2

దీనివల్ల తెలుగులో ఈ సినిమాపై క్రేజ్ మరింతగా పెరుగుతుందని భావిస్తున్నారు. సినిమాలో అల్లు అర్జున్ క్యారెక్టర్ ను ఎలివేట్ చేస్తూ ఈ డైలాగులు ఉండబోతున్నాయి. ఇటీవలే బన్నీ పుట్టినరోజుకు పవన్ కల్యాణ్ ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేశారు. అప్పటికే వీరిద్దరి మధ్య దూరం తగ్గిందని, సుకుమార్ ఈ సినిమాకు మరింత క్రేజ్ తీసుకురావడానికి పవన్ చేత వాయిస్ చెప్పించాలని నిర్ణయించుకున్నారు.

దీంతో పవన్ కల్యాణ్ అభిమానులు, అల్లు అర్జున్ అభిమానుల మధ్య అంతరం తగ్గుతుందని, సినిమా విడుదల సమయంలో పవన్ కల్యాణ్ అభిమానులవల్ల కూడా కలెక్షన్స్ పెరుగుతాయనేది నిర్మాత, దర్శకుల ఆలోచనగా ఉందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+