బాలయ్య పవర్‌ఫుల్ హిట్‌ను 100 సార్లు చూసిన పవన్ కల్యాణ్

నందమూరి బాలకృష్ణ, పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్.. ఈ ఇద్దరు హీరోల స్వభావాలు దాదాపు ఒకేలా ఉంటాయి. ఇద్దరూ ఎంతో ముక్కుసూటిగా, మనసులో ఏముంటే అది దాచుకోకుండా మాట్లాడే మనస్తత్వం ఉన్నవారు. టాలీవుడ్‌లో ఈ ఇద్దరు దిగ్గజాల మధ్య చాలా కాలంగా ఒకరిపై ఒకరికి అపారమైన గౌరవంతో కూడిన మంచి అనుబంధం ఉందనే విషయం అందరికీ తెలిసిందే. ప్రస్తుతం రాజకీయాల్లో కూడా ఇద్దరూ మిత్రులుగా కొనసాగుతున్నారు. తెలుగుదేశం పార్టీ తరఫున హిందూపురం నుంచి వరుసగా మూడుసార్లు బాలయ్య విజయం సాధించగా, పిఠాపురం నుంచి గెలుపొందిన పవన్ కల్యాణ్ ఏపీ ఉప ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు.

ఏకంగా 100 సార్లు చూశారు

బాలకృష్ణ నటించిన ఒక పవర్‌ఫుల్ హిట్ సినిమాను పవన్ కళ్యాణ్ ఏకంగా వంద సార్లు తిలకించారనే వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో విశేషంగా వైరల్ అవుతోంది.దర్శకుడు బి. గోపాల్ కాంబోలో బాలకృష్ణ కథానాయకుడిగా వచ్చిన ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్ చిత్రం 'సమరసింహారెడ్డి'. తెలుగు సినీ చరిత్రలోనే ఫ్యాక్షన్ నేపథ్యంలో సరికొత్త ట్రెండ్‌ను సృష్టించిన ఈ సినిమా పవన్ కళ్యాణ్‌కు ఎంతో ఫేవరెట్ మూవీ. ఈ చిత్రంలో బాలయ్య నటించిన విధానం, ఆయన బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీతో పాటు యాక్షన్ ఘట్టాలు పవన్ కళ్యాణ్‌ను విపరీతంగా ఆకట్టుకున్నాయని సినీ వర్గాలు చెబుతుంటాయి.

పేర్ని నాని.. ఈ పాపం ఊరికే పోదు.. అనుభవిస్తావ్: పవన్ అభిమాని నిరంజన్ తండ్రి
పేర్ని నాని.. ఈ పాపం ఊరికే పోదు.. అనుభవిస్తావ్: పవన్ అభిమాని నిరంజన్ తండ్రి
Pawan Kalyan watched Nandamuri Balakrishna powerful blockbuster Samarasimha Reddy nearly 100 times

సన్నిహితుల దగ్గర చెప్పిన పవన్

సినిమాపై ఉన్న ఇష్టంతో పవన్ కళ్యాణ్ 'సమరసింహారెడ్డి'ని దాదాపు వంద సార్లు చూశానని తన సన్నిహితుల వద్ద తరచుగా సరదాగా పంచుకునేవారట. ఆ సినిమాలో బాలకృష్ణ ప్రదర్శించిన మేనరిజమ్స్ తనను ఎంతగానో ఇన్స్‌పైర్ చేశాయని కూడా ఆయన పేర్కొనేవారని సమాచారం. ఒక స్టార్ హీరో, తన సమకాలీన మరొక స్టార్ హీరో సినిమాను ఇన్ని సార్లు చూడటం అనేది సినీ ఇండస్ట్రీలో చాలా అరుదైన విషయమని, ఇది వారి మధ్య ఉన్న స్నేహానికి, అభిమానానికి నిదర్శనమని అభిమానులు మురిసిపోతున్నారు.

ఆ నడుము ఎక్కడ చేయించారు మేడం.. పవన్ కళ్యాణ్ హీరోయిన్ వీడియో వైరల్ !!
ఆ నడుము ఎక్కడ చేయించారు మేడం.. పవన్ కళ్యాణ్ హీరోయిన్ వీడియో వైరల్ !!

ప్రస్తుతం 60 ప్లస్ వయసులో కూడా బాలయ్య వరుస బ్లాక్‌బస్టర్లతో బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుండగా, పవన్ కళ్యాణ్ అటు సినిమాలు, ఇటు రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తున్నారు. ఏదేమైనా, టాలీవుడ్‌లోని ఈ ఇద్దరు మాస్ ఐకాన్స్ మధ్య ఉన్న ఈ గౌరవప్రదమైన అనుబంధం నందమూరి, పవన్ కళ్యాణ్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+