అన్న మనల్ని ఎవరూ ఆపలేదు..బాక్సాఫీస్ వద్ద మన సినిమానే ఆగిపోయింది..!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద వీకెండ్‌తో పాటు వర్కింగ్ డేస్‌లో నిరాశ పరిచింది. భారీ అంచనాలతో విడుదలైన ఈ సినిమా అనుకున్న దానికంటే ఎక్కువ డ్రాప్స్‌ను నమోదు చేసింది. 'హరిహర వీరమల్లు' చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద చతికిలపడింది. రూ.250 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా, వీకెండ్‌లో కొంతవరకు నెట్టుకొచ్చినా, వర్కింగ్ డేస్‌లో మాత్రం కలెక్షన్ల పరంగా తీవ్ర నిరాశను మిగిల్చింది.
హరిహర వీరమల్లు' పెయిడ్ ప్రీమియర్ల ద్వారా రూ.12.75 కోట్లు రాబట్టి మంచి శుభారంభాన్నిచ్చింది. ఫస్ట్ డే నాడు రూ.34.75 కోట్లు వసూలు చేసి పవన్ కళ్యాణ్ కెరీర్‌లోనే అత్యధిక ఓపెనింగ్స్ సాధించిన చిత్రంగా నిలిచింది. అయితే, రెండో రోజు నుంచే కలెక్షన్లు తగ్గుముఖం పట్టాయి. రెండో రోజున రూ.8.79 కోట్ల నెట్, మూడో రోజున రూ.9.15 కోట్లు, నాలుగో రోజున రూ.10.6 కోట్లు వసూలయ్యాయి.

వీకెండ్ వరకు కొంత పర్వాలేదనిపించినా, వర్కింగ్ డేస్‌లో సినిమా కలెక్షన్లు ఊహించని విధంగా పడిపోయాయి. ఐదో రోజైన సోమవారం కేవలం రూ.2.1 కోట్ల నెట్ మాత్రమే రాబట్టగలిగింది. ఆరో రోజుకు వచ్చేసరికి పరిస్థితి మరింత దిగజారింది. ఆరో రోజున ప్రపంచవ్యాప్తంగా కేవలం రూ.1.80 కోట్ల గ్రాస్ వసూళ్లను మాత్రమే రాబట్టింది. ఇక 9వ రోజున కేవలం 6 వేల లోపే టికెట్ సేల్స్ ను సొంతం చేసుకున్న సినిమా మొత్తం మీద 17 లక్షల రేంజ్ లో షేర్ మార్క్‌ని అందుకుంది ఈ సినిమా.
ఈ సినిమా 14 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా సాధించిన కలెక్షన్ల వివరాలు ఇలా ఉన్నాయి. ఈ సినిమా 14 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా మొత్తం రూ. 68.92 కోట్ల షేర్ (రూ. 113.30 కోట్ల గ్రాస్) సాధించింది. తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్ , తెలంగాణలో ఈ సినిమా రూ. 57.58 కోట్ల షేర్ సాధించి, మిగిలిన ప్రాంతాల్లో రూ. 11.34 కోట్ల షేర్ వసూలు చేసింది.
15వ రోజు కలెక్షన్స్: ₹1.20 కోట్లు
16వ రోజు కలెక్షన్స్: ₹60 లక్షలు
16 రోజుల వరకు ఇండియా నెట్ కలెక్షన్స్: ₹87 కోట్లు
16 రోజుల వరకు ఇండియా గ్రాస్ కలెక్షన్స్: ₹103 కోట్లు
ఓవర్సీస్ కలెక్షన్స్: ₹18 కోట్లు
మొత్తం వరల్డ్‌వైడ్ గ్రాస్ కలెక్షన్స్ (ఇండియా గ్రాస్ + ఓవర్సీస్): ₹121 కోట్లు
ఈ లెక్కలు సాక్‌నిక్ తన నివేదికలో పేర్కొంది.ఈ వివరాలు సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలా రాణించిందో స్పష్టంగా చూపుతున్నాయి.కూలీ, వార్-2 సినిమాల విడుదలతో బాక్సాఫీస్ వద్ద హరిహర వీరమల్లు కథ ముగిసినట్టే అని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.దీంతో ఈ సినిమాకు రూ.100 కోట్లకు పైగానే నష్టం వచ్చినట్టు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications