మెగా ఫ్యాన్స్‌కు పునకాలు తెచ్చిందే న్యూస్
మెగా అభిమానులకు పండుగ లాంటి వార్త.ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన 'హరి హర వీరమల్లు' సినిమా విడుదల తేదీని ఫిక్స్ చేశారు మేకర్స్. క్రిష్ జాగర్లమూడి , జ్యోతికృష్ణ స్వీయ దర్శకత్వంలో రూపొందుతున్న 'హరి హర వీరమల్లు' సినిమా విడుదలకు సిద్ధమైంది. ఈ చారిత్రాత్మక యాక్షన్ అడ్వెంచర్ చిత్రం జూన్ 12న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
పవన్ కళ్యాణ్ రాజకీయ కార్యకలాపాల వల్ల ఈ సినిమా షూటింగ్ ఆలస్యమైంది. దీనితో విడుదల తేదీ వాయిదా పడుతూ వచ్చింది. అయితే, ఎట్టకేలకు ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించారు. ఈ సినిమాను రెండు భాగాలుగా రూపొందిస్తున్నారు. ఏఎం రత్నం సమర్పణలో, మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఎ. దయాకర్ రావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఆస్కార్ అవార్డు గ్రహీత ఎంఎం కీరవాణి ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన 'మాట వినాలి', 'కొల్లగొట్టినాదిరో' పాటలు శ్రోతలను అలరించాయి. పవన్ కళ్యాణ్ సింగిల్ హీరోగా నటించి చాలా కాలమైంది, దీంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.
17వ శతాబ్దం నేపథ్యంలో సాగే ఈ కథలో పవన్ కళ్యాణ్ చారిత్రాత్మక యోధుడిగా కనిపించనున్నారు. ఆయన సరసన నిధి అగర్వాల్ నటిస్తోంది. బాబీ డియోల్, నర్గీస్ ఫక్రీ, నోరా ఫతేహి వంటి ప్రముఖ నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.












Click it and Unblock the Notifications