'లక్కీ' ఛాన్స్ కొట్టేసిన పవన్ కళ్యాణ్ హీరోయిన్ 'నిధి అగర్వాల్'..
అక్కినేని నాగ చైతన్య సరసన "సవ్యసాచి" సినిమాలో నటించి టాలీవుడ్ కి పరిచయం అయింది 'నిధి అగర్వాల్ '. ఆ తర్వాత అఖిల్ హీరోగా వచ్చిన మిస్టర్ మజ్నులో కూడా నటించింది నిధి. డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తెరకెక్కించిన "ఇస్మార్ట్ శంకర్" చిత్రం బ్లాక్‌బస్టర్ కావడంతో అమ్మడి దశ మారిపోయింది. పలు వరుస సినిమాల్లో నటించిన ఈ భామ ప్రస్తుతం ఈమె పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న హరిహర వీరమల్లు సినిమాలో నటిస్తుంది. తమిళ్‌లో ఈమెకు అదిరిపోయే క్రేజ్ ఉంది. సోషల్ మీడియా లోనూ యాక్టివ్ గా ఉండే ఈ భామ తన భారీ అందాలను ఆరబోస్తూ కుర్రకారును ఫిదా చేస్తుంది.
అయితే మొదట్లో ఈ సినిమాకు క్రిష్ దర్శకత్వం వహించగా పలు కారణాలతో ఆయన చిత్రం నుంచి వైదొలిగారు. ప్రస్తుతం ఈ మూవీకి జ్యోతి కృష్ణ దర్శకత్వం వహిస్తుండగా.. షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఇప్పటికే ఈ సినిమా రిలీజ్ కావాల్సి ఉండగా.. పాలిటిక్స్ కారణంగా పోస్ట్ పోన్ అవుతూ వచ్చింది. మార్చి 28న ఈ సినిమా పార్ట్ 1 ప్రేక్షకుల ముందుకు రానుంది. అలానే మారుతి దర్శకత్వంలో ప్రభాస్ చేస్తున్న రాజా సాబ్ సినిమాలో కూడా నటిస్తోంది. అయితే ఈ భామకు ఇప్పుడు మరో లక్కీ ఛాన్స్ దక్కినట్టు సమాచారం.

తొలిప్రేమ సినిమాతో డైరెక్టర్ గా పరిచయం అయిన వెంకీ అట్లూరి ప్రస్తుతం ఫుల్ స్వింగ్ లో దూసుకుపోతున్నారు. రంగ్ దే సినిమా తర్వాత రూట్ మార్చిన వెంకీ.. సార్, లక్కీ భాస్కర్ సినిమాలతో వరుసగా హిట్స్ అందుకున్నాడు. ప్రస్తుతం ఆయన సూర్యతో మూవీ ప్లాన్ చేస్తున్నాడు. ఈ సినిమాను సితార ఎంటర్‌టైనమెంట్స్ నిర్మించబోతున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని మేకర్స్ త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు.
ఇక ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ ఉంటారని.. ఒక హీరోయిన్ గా ఇప్పటికే భాగ్యశ్రీ భోర్సే ఫిక్స్ అవ్వగా మరో హీరోయిన్ గా నిధి అగర్వాల్ ని తీసుకోబోతున్నట్టు టాక్ నడుస్తోంది. ఈ మూవీలో సూర్య వెనుకబడిన కులానికి చెందిన యువకుడిగా కనిపించబోతున్నాడని అంటున్నారు. కాగా మంచి కథ దొరికితే తెలుగులో చేస్తానని పలుమార్లు వ్యాఖ్యానించారు. దీంతో ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి.












Click it and Unblock the Notifications