'OG' ట్రైలర్ రివ్యూ..ఇంత దారుణంగా ఉందేంటి భయ్యా..!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఓజీ సినిమా ట్రైలర్ విడుదలైంది. 'నెత్తురుకు మరిగిన హంగ్రీ చీతా' అనే ట్యాగ్‌లైన్‌తో విడుదలైన ఈ ట్రైలర్, అంచనాలను తారాస్థాయికి చేర్చింది. దర్శకుడు సుజిత్, పవన్‌ను అభిమానులు ఎలా చూడాలని కోరుకుంటారో సరిగ్గా అలాగే చూపించారు. ఈ ట్రైలర్‌లో పవన్ నటన, స్టైల్ అభిమానులకు గూస్ బంప్స్ తెప్పించాయి.
ఈ ట్రైలర్ ప్రారంభం నుండి చివరి వరకు ఉత్కంఠగా సాగింది. "బాంబేలో గ్యాంగ్ వార్స్ మళ్ళీ మొదలయ్యాయి. కానీ ఈ సారి గన్స్ అన్నీ సత్యదాదా వైపు తిరిగాయి" అనే డైలాగ్‌తో ట్రైలర్ మొదలైంది. భారీ యాక్షన్ సీన్లతో పవన్ ఎంట్రీ పవర్ ఫుల్‌గా ఉంది. విలన్స్‌ను వెంటాడి, వేటాడి చంపే విధానం, "బెంగాల్ టైగర్" అంటూ వచ్చే డైలాగ్ అభిమానులను ఉర్రూతలూగిస్తోంది.

ట్రైలర్‌లో మరో హైలైట్ థమన్ సంగీతం. తన నేపథ్య సంగీతంతో థమన్ సన్నివేశాలకు మరింత ఊపు తీసుకొచ్చారు. ఇక బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ విలన్‌గా తనదైన శైలిలో ఆకట్టుకున్నారు. ఆయన లుక్, హావభావాలు సినిమాపై ఆసక్తిని పెంచాయి. హీరోయిన్‌గా ప్రియాంక మోహన్ పవన్ సరసన చక్కగా సరిపోయింది. ప్రకాష్ రాజ్, శ్రీయా రెడ్డి వంటి నటులు కీలక పాత్రల్లో కనిపించారు.
డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై డీవీవీ దానయ్య, కళ్యాణ్ దాసరి ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ సినిమా సెప్టెంబర్ 25న దసరా కానుకగా విడుదల కానుంది. రవి కె చంద్రన్ & మనోజ్ పరమహంస సినిమాటోగ్రఫీ, నవీన్ నూలి ఎడిటింగ్ ట్రైలర్‌కు మరింత వన్నె తెచ్చాయి. ఈ ట్రైలర్ చూసిన తర్వాత, సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధించడం ఖాయమని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications