రాజమౌళి సినిమాను తిరస్కరించిన పవన్ కల్యాణ్

రాజమౌళి... ప్రస్తుతం ఈ పేరు దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచవ్యాప్తంగా వినిపిస్తోంది. తెలుగు సినిమాను జాతీయస్థాయికి, ఆ తర్వాత అంతర్జాతీయస్థాయికి తీసుకువెళ్లారు. ఆర్ఆర్ఆర్ సినిమాతో అయితే హాలీవుడ్ లోని సెలబ్రిటీలంతా రాజమౌళికి ఫ్యాన్స్ అయ్యారు. 24 సంవత్సరాల నుంచి పరిశ్రమలో కొనసాగుతున్న రాజమౌళికి ఇంతవరకు ఫ్లాప్ లేదు. అంత జాగ్రత్తగా, ఎంతో హార్డ్ వర్క్ తో సినిమా తీస్తారు.

రాజమౌళి నుంచి ఆఫర్ వస్తే ఏ హీరో అయినా ఎగిరి గంతేస్తాడు. అటువంటి ఆఫర్ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కు వచ్చింది. జూనియర్ ఎన్టీఆర్ తో ఓ సినిమా చేయాలనుకొని ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రారంభించారు. అయితే బడ్జెట్ భారీగా అవుతుందని తేలడంతో ఈలోపు వేరే హీరోతో ఓ సినిమా చేద్దామని భావించి తన తండ్రి విజయేంద్రప్రసాద్ కు కథను తయారుచేయమని చెప్పారు. దీంతో ఆయన విక్రమార్కుడు కథ రాశారు. పవన్ కల్యాణ్ కు ఈ కథ బాగా నప్పుతుందని ఆయన భావించారు. పవన్ శైలి కోసం పోలీసు క్యారెక్టర్ కు కాస్తంత హాస్యాన్ని కూడా జోడించారు.

pawankalyan rejected rajamouli movie details here

దీంతో రాజమౌళి పవన్ కల్యాణ్ ను కలిశారు. ఇప్పుడే చేయలేను.. కాస్తంత విరామం తీసుకొని తర్వాత చూద్దాం అన్నారు. అయితే రాజమౌళి ఆలస్యం చేయకుండా వెంటనే కథలో కొన్ని మార్పులు చేసి రవితేజకు చెప్పి ఓకే చేయించారు. రవితేజ బాడీ లాంగ్వేజ్ కు తగ్గట్టుగా ఈ సినిమా రావడం, అత్తిలి సత్తిబాబు క్యారెక్టర్ లో రవితేజ నటన ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. సినిమా సూపర్ హిట్ అయింది. ఈ సినిమా తర్వాత రవితేజ క్రేజ్ పెరిగింది. తర్వాత రాజమౌళి బాహుబలి, ఆర్ఆర్ఆర్ సినిమాలతో పాన్ ఇండియా, పాన్ వరల్డ్ సినిమాలు తీస్తుండటం, పవన్ కల్యాణ్ జనసేన పార్టీద్వారా రాజకీయాల్లో బిజీగా ఉండటంతో వీరిద్దరి కాంబినేషన్ లో ఇంతవరకు సినిమా రాలేదు. భవిష్యత్తులోనైనా వస్తుందేమోనని అభిమానులు ఎదురుచూస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+