అందరిచూపు జమిందార్ గారి భార్యమీదే!
ఇటీవలికాలంలో విడుదలవుతున్న సినిమాల్లో హీరో, హీరోయిన్లకన్నా కీలక పాత్రల్లో నటించినవారే దేశవ్యాప్తంగా పేరు, క్రేజ్ తెచ్చుకుంటున్నారు. ఎక్కువమంది హీరోయిన్లు ఈ తరహా కీలక పాత్రల్లో నటించేందుకు ముందుకు వస్తున్నారు. యానిమల్ సినిమాలో నటించిన తృప్తి దిమ్రి, సలార్ సినిమాలో నటించిన శ్రియారెడ్డి, మంగళవారం సినిమాలో నటించిన దివ్యపిళ్లై.. లాంటివారంతా హీరోయిన్లకు మించిన క్రేజ్, పేరు తెచ్చుకుంటున్నారు.
అజయ్ భూపతి దర్శకత్వంలో వచ్చిన మంగళవారం చిత్రం మంచి హిట్ అయింది. హీరోయిన్ గా పాయల్ రాజ్ పుత్ నటించగా, కీలకమైన జమీందారు భార్య పాత్రలో దివ్యపిళ్లై నటించింది. ఆర్ఎక్స్ 100 సినిమా తర్వాత అజయ్ కానీ, పాయల్ కానీ ఈ సినిమాతోనే మరో హిట్ కొట్టారు. ఈ మధ్యనే ఓటీటీలో విడుదలై సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. పాయల్ కన్నా దివ్యకే ఎక్కువ మార్కులు పడుతున్నాయి. సోషల్ మీడియాలో కుర్రాళ్ల క్రష్ గా మారిపోయింది.

సినిమా చివరలో పాయల్ రాజ్ పుత్ ను చంపే హంతకురాలిగా ఆమె నటనకు అందరూ ఫిదా అయ్యారు. గూగుల్ లో దివ్య పిళ్లై గురించే అందరూ సెర్చ్ చేస్తున్నారు. ఆమెకు సంబంధించిన విషయాలను తెలుసుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఆమె కేరళకు చెందిన ఎయిర్ హోస్టెస్. ఒక డైరెక్టర్ ఈమెను ఒక పెళ్ళిలో చూసి 2015 మలయాళంలో పుష్ప విలన్ ఫాహాద్ ఫాజిల్ హీరోగా నటించిన అయల్ నంజళ్ల చిత్రంలో అవకాశం ఇచ్చాడు. ఈ సినిమా హిట్ అయింది.
ఆ తర్వాత పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన ఊజం చిత్రంలో నటించింది. ఇది బ్లాక్ బస్టర్ అయింది. అనంతరం అసలు ఖాళీ లేనంతగా అవకాశాలను అందుకుంది. మంగళవారం సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన దివ్యకు బ్రేక్ వచ్చిందని చెప్పొచ్చు. ఈ సినిమా ఫస్ట్ హాఫ్ చూసి ఇలాంటి భార్య ఉండాలని అందరూ అనుకున్నారు. అయితే క్లైమాక్స్ చూసి అసలు పెళ్లే వద్దు అనుకున్నారు. అంతగా ప్రభావితం చేసింది. భవిష్యత్తులో తెలుగులో ఇంకా ఎన్ని సినిమాలు చేస్తుందో? ఏ తరహా పాత్రలు పోషిస్తుందో చూడాలి మరి.












Click it and Unblock the Notifications