జానీ మాస్టర్ ఇక నువ్వు మారావా ..!
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ 'గేమ్ ఛేంజర్' వంటి భారీ ఫ్లాప్ తర్వాత నటిస్తూన్న సినిమా 'పెద్ది'. ఉప్పెన ఫేం బుచ్చిబాబు సన దర్శకత్వం వహిస్తూన్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకున్నాయి. జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తూన్న ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమాలోని మొదటి సాంగ్‌ను విడుదల చేశారు.
Just Reminder
— Mr.© (@SaiCharan775) November 4, 2025
Buchi Babu First Movie Songs ❤️❤️#Peddi pic.twitter.com/SVhrzb5EYR
'చికిరి' అంటూ సాగే పాటను విడుదల చేశారు చిత్ర యూనిట్. ఈ సాంగ్‌లో రామ్ చరణ్ తనదైన స్టైల్లో వేసిన హుక్ స్టెప్ సోషల్ మీడియాలో అంచనాలను మించి వైరల్ అయింది. అయితే ఈ స్టెప్ చూసిన ఆడియన్స్‌కు కాస్త విభిన్నంగా స్పందిస్తున్నారు. నెటిజన్లు ,మీమర్స్ ఈ స్టెప్‌ను ఫన్నీ సంఘటనలకు ఉపయోగించుకుంటూ ఎడిటింగ్ వీడియోలను ఒక రేంజ్‌లో ట్రెండ్ చేస్తున్నారు.

ముఖ్యంగా ఈ సాంగ్‌కు కొరియోగ్రఫి చేసిన జానీ మాస్టర్‌ను టార్గెట్ చేసుకుని విమర్శలు గుప్పిస్తున్నారు నెటిజన్లు. ఒకప్పుడు జానీ మాస్టర్ స్టెప్పులు అద్భుతమైన ఫ్లో, అందంతో కనిపించేవి. కానీ ఇప్పుడు ఆయన కంపోజ్ చేస్తున్న కొన్ని స్టెప్పులు ట్రాల్ మెటీరియల్‌గా మారుతున్నాయన్నది విశ్లేషకుల అభిప్రాయపడుతున్నారు.పైగా ఈ స్టెప్పులను చూడగానే ఇది జానీ మాస్టర్ కొరియోగ్రఫి చేశారని ఈజీగా అర్థం అయిపోయింది.
Pushpa gaadu,Peddi gaadu pic.twitter.com/QqUyJO38Ew
— kAArtheek 🗡️ 🔱 (@GODzillAASTAN) November 5, 2025
ఎందుకంటే గతంలో జానీ మాస్టర్ చేసిన డ్యాన్స్ స్టెప్పులనే ఈ 'చికిరి' పాటకు వాడేశారనే మాటలు వినిపిస్తున్నాయి. జానీ మాస్టర్ కంపోజ్ చేసిన స్టెప్పులు ట్రోల్ మెటీరియల్‌గా మారడంపై సినీ విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జైలుకు వెళ్ళకముందు ఆయన చివరిగా కంపోజ్ చేసిన 'గేమ్ చేంజర్' లోని 'Dhop' పాట కూడా అనుకున్న స్థాయిలో క్లిక్ అవ్వలేదు.
#Peddi Best Thing On The Internet Today pic.twitter.com/KYMPr7sTVP
— Box Office (@Box_Office_BO) November 5, 2025
జైలు నుండి బయటకు వచ్చిన తర్వాత సరైన ప్రాక్టీస్ లేకపోవడం వల్లే క్రియేటివిటీ తగ్గిందా? అని సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ, వివాదం తర్వాత కూడా రామ్ చరణ్ మద్దతుతో తిరిగి వచ్చిన జానీ మాస్టర్, ఈ ప్రతికూల విమర్శలను ఛేదించుకుని, తన తదుపరి కంపోజిషన్‌లతో మళ్లీ తన డ్యాన్స్ మెజీషియన్ ముద్రను నిలబెట్టుకుంటారో లేదో చూడాలి.
🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣#CHIKIRI #PEDDI pic.twitter.com/ZHcwhIQXJf
— benuuu‼️ (@needookudu07) November 5, 2025












Click it and Unblock the Notifications