Peddi First Review: అరాచకం బాబోయ్.. చివరి 50 నిమిషాలు షాకింగ్, డిస్ట్రబింగ్..!!
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, బుచ్చిబాబు సానా కాంబోలో వస్తున్న మోస్ట్ ఎవైటెడ్ మూవీ 'పెద్ది'. ప్రస్తుతం ఎక్కడ చూసినా పెద్ది మేనియా కనిపిస్తోంది. ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా జూన్ 4న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇక పెద్ది ట్రైలర్ మే 18 న ముంబైలో గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. రిలీజ్ కు టైమ్ దగ్గర పడుతున్న నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రొమోషన్స్ ను వేగవంతం చేసింది. మరోవైపు పెద్ది డైరెక్టర్ బుచ్చిబాబు ఇప్పటికే వరుస ఇంటర్వ్యూలతో బిజీగా ఉంటున్నాడు. సినిమా గురించి ఆయన చెబుతున్న ఒక్కో విషయం సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతోంది. దాంతో అటు మెగా ఫ్యాన్స్ తో పాటు సాధారణ సినీ ప్రేక్షకుడు సైతం పెద్ది సినిమా రిలీజ్ కోసం ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.
అయితే తాజాగా పెద్ది మూవీకి సంబంధించిన ఓ క్రేజీ అప్డేట్ ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్ని ఫ్యాన్ ను షేక్ చేస్తోంది. పెద్ది మూవీ రన్ టైమ్ 3 గంటలకు పైగానే ఉంటుందని టాక్ వినిపిస్తోంది. ఈ మూవీ రన్ టైమ్ 3 గంటల 2 నిమిషాలకు లాక్ చేసినట్లు సమాచారం. అయితే ఇప్పుడు చాలా సినిమాలు 3 గంటల రన్ టైమ్ తో వచ్చి బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టాయి. దాంతో పెద్ద హీరో సినిమాలకు ఇప్పుడు రన్ టైమ్ పెద్ద సమస్యే కాదు. ఇక ఈ మూవీని ఫస్ట్ ఫ్రేమ్ నుంచి ఎక్కడా బోర్ కొట్టకుండా ఊర మాస్ ఎలివేషన్స్ తో తీర్చిదిద్దారట దర్శకుడు బుచ్చిబాబు.
పెద్ది సినిమాలో రామ్ చరణ్ మొత్తం నాలుగు గెటప్ లతో మెప్పించనున్నారట. స్పోర్ట్స్ నేపథ్యానికి బలమైన ఎమోషన్స్ ను జోడించి అలాగే పూర్తిగా కమర్షియల్ పద్దతిలో ఈ చిత్రాన్ని బుచ్చిబాబు తెరకెక్కించాడు. ఇక పెద్దిలో అసలైన సినిమా చివరి 50 నిమిషాలు అని టాక్ బలంగా వినిపిస్తోంది. చివరి 50 నిమిషాల్లో రామ్ చరణ్ కనిపించరని పెద్ది క్యారెక్టర్ మాత్రమే కనిపిస్తుందని దర్శకుడు బుచ్చిబాబు ధీమా వ్యక్తం చేస్తున్నాడు. అలాగే క్లైమాక్స్ ఓ భారీ స్టేడియంలో ఉంటుందని.. ఫుల్ ఎమోషన్ తో థియేటర్ నుంచి బయటకు వస్తారని టాక్ వినిపిస్తోంది. ఇక మెగా ఫ్యాన్స్ మాత్రం చరణ్ ఈసారి బాక్సాఫీస్ రికార్డున్ని బద్దలు కొడతారని కాలర్ ఎగరేస్తున్నారు.
పెద్ది మూవీ ట్రైలర్ పై తాజాగా మెగాస్టార్ చిరంజీవి ఓ ట్వీట్ పెట్టిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో చరణ్.. బుచ్చి.. రెహమాన్.. ఒక్కొక్కరు తమ బెస్ట్ ఇచ్చారు.. కలిసి మాత్రం రఫ్ఫాడించేశారు! ఎంత ఊహించుకున్నా.. దాన్ని మించి ఉంటుందీ ఈ ట్రైలర్.. అని రాసుకొచ్చారు చిరంజీవి. అంతేకాక "మీరందరూ నేను ఆడానని అనుకుంటున్నారు. నేను పోరాడాను సారు" అనే డైలాగ్ ను కూడా లీక్ చేశారు. ఇక ఇప్పటికే పెద్ది టీజర్, గ్లింప్స్, చికిరి చికిరి సాంగ్, రయ్ రయ్ రారా సాంగ్స్ తో సినిమాపై అంచనాలను భారీగా పెంచేశాయి.

ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను జూన్ 2న హైదరాబాద్ లో అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. ఈ మూవీలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఏ ఆర్ రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీశ్ కిలారు, మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.












Click it and Unblock the Notifications