రామ్ చరణ్ బర్త్‌డే గిఫ్ట్ మామూలుగా లేదుగా!
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టిన రోజు, శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆయన నటిస్తున్న లేటెస్ట్ సినిమా 'పెద్ది' సినిమా నుంచి అదిరిపోయే గ్లింప్స్ విడుదలైంది. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాలో రామ్ చరణ్ మునుపెన్నడూ చూడని 'పెద్ది పహిల్వాన్' అనే పవర్ ఫుల్ పాత్రలో కనిపించబోతున్నాడు. తాజాగా విడుదలైన ఈ గ్లింప్స్ ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పిస్తోంది. "పెద్ది అంటే చావుకు ఎదురెళ్లే ఆట.. ఆటే నా పొగరు" అనే రెండు డైలాగులు అభిమానుల్లో ఉత్సాహాన్ని రేపుతున్నాయి.
నయా అవతారంలో మెగా పవర్‌స్టార్
ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఓ మట్టి కుస్తీ యోధుడిగా కనిపిస్తున్నారు. కండలు తిరిగి శరీరం, గడ్డం, జుట్టును ముడి వేసిన రగ్గడ్ లుక్‌లో చరణ్ చాలా ఇంటెన్సివ్‌గా కనిపించాడు. స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో ఈ సినిమాలో తెరకెక్కుతోంది. ఆయన ఆహార్యం చూస్తుంటే ఒక పవర్‌ఫుల్ కుస్తీ నేపథ్యంలో సాగే సినిమా అని స్పష్టమవుతోంది. తన ఆటే తన బలమని, తన విజయమే తన గర్వమని చెప్పే ఈ డైలాగ్ చరణ్ క్యారెక్టరైజేషన్‌ను ప్రతిబింబిస్తోంది. బుచ్చిబాబు సానా ఈ చిత్రాన్ని చాలా మాస్ అండ్ ఎమోషనల్ వేలో ప్రెజెంట్ చేస్తున్నారని గ్లింప్స్ చూస్తుంటే అర్థమవుతోంది. ఇది చరణ్ కెరీర్‌లోనే ఓ విభిన్నమైన, ఫిజికల్ ఛాలెంజింగ్ రోల్ అని చెప్పవచ్చు.

భారీ తారాగణం.. అస్కార్ మ్యూజిక్
ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. అలాగే కన్నడ స్టార్ హీరో శివరాజ్‌కుమార్, దివ్యేందు శర్మ, జగపతి బాబు, బొమన్ ఇరానీ, సత్య వంటి అగ్ర నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. అస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ ఈ చిత్రానికి మ్యూజిక్ అందిస్తుండటం విశేషం. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ పతాకంపై వెంకట సతీష్ కిలారు ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
The makers of #Peddi have officially dropped a glimpse, confirming the much-hyped shirtless fight💥and it hits with brutal intensity.
— YKTV ENTERTAINMENT (@Yktv_Ent) March 27, 2026
A complete makeover,a rustic avatar, and a ferocious performance loading!!#Peddi is shaping up to be a mass eruption 🌋 #PeddiPehelwanGlimpse https://t.co/jvceGbUp40 pic.twitter.com/QwQxkQCw1T
విడుదల తేదీ ఖరారు
ఈ చిత్రాన్ని ఏప్రిల్ 30, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో పాన్ ఇండియా లెవల్లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. సమ్మర్ కానుకగా వస్తున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించడం ఖాయమని అభిమానులు ఆశిస్తున్నారు.












Click it and Unblock the Notifications