అల్లు అర్జున్‌కు షాక్ ..చిరంజీవి పూజ గదిలో అల్లు రామరామలింగయ్య ఫొటో
మెగా వర్సెస్ అల్లు వివాదం రోజు రోజుకి మరింత ముదురుతున్నట్టు కనిపిస్తోంది. పైకి అంతా బాగానే ఉన్నప్పటికి లోలోపల మాత్రం ఇరు ఫ్యామిలీల మధ్య దూరం పెరుగుతున్నట్టే కనిపిస్తోంది. ఇక అభిమానుల మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి కనిపిస్తోంది. అల్లు అర్జున్ ఉద్దేశించి మెగా బ్రదర్ నాగబాబు ట్విట్టర్ వేదికగా విమర్శలు చేయడం, దానికి బన్ని అభిమానులు ఓ రేంజ్‌లో ఫైర్ అవ్వడం చక చక జరిగిపోయాయి. అల్లు అర్జున్ అభిమానుల దెబ్బకు నాగబాబు ట్విట్టర్ అకౌంట్‌ను కూడా డిలీట్ చేశారు.
ఇదే సమయంలో పవన్ కల్యాణ్ సైతం పరోక్షంగా అల్లు అర్జున్ గురించి కామెంట్స్ చేయడం చర్చనీయంశంగా మారింది. మెగా కోడలు, రామ్ చరణ్ భార్య ఉపాసన పుట్టిన రోజు సందర్బంగా అల్లు అర్జున్ , ఆయన భార్య స్నేహారెడ్డి ఎవరూ స్పందించలేదు. ఇది చాలదన్నట్టు పవన్ కల్యాణ్ ఇటీవల అల్లు అర్జున్ గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు. 40 ఏళ్ల క్రితం హీరోలు అడువులను కాపాడేవారు. కానీ ఇప్పుడు పరిస్థితులు దీనికి పూర్తి విరుద్ధంగా మారాయని ఆయన అభిప్రాయపడ్డారు. ఇప్పుడున్న హీరోలు అడువులను నరికి స్మగ్లింగ్ చేస్తున్నారని చెప్పి పవన్ కల్యాణ్ సంచలన కామెంట్స్ చేశారు. నేను ఇండస్ట్రీకి చెందిన వాడినేనని పవన్ కల్యాణ్ గుర్తు చేశారు.

ఇలాంటి సినిమాలు చేయడానికి తాను చాలా ఇబ్బంది పడతానని పవన్ కల్యాణ్ చెప్పుకొచ్చారు. అయితే పవన్ కల్యాణ్ ఈ వ్యాఖ్యలు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ను ఉద్దేశించి చేశారని మెజార్టీ నెటిజన్లు అభిప్రాయపడ్డారు. ఇటువంటి తరుణంలో అల్లు అర్జున్ చేసిన కామెంట్స్ సంచలనం సృష్టించాయి. సుకుమార్ భార్య నిర్మాతగా వ్యవహరించిన మారుతీ నగర్ సుబ్రహ్మణ్యం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు అల్లు అర్జున్ హాజరయారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 'మై డియర్ ఫ్యాన్స్.. మీరే నా ఆర్మీ, నా ఫ్యాన్స్ అంటే నాకు పిచ్చి. హీరోని చూసి చాలామంది ఫ్యాన్స్ అవుతారు, కానీ నేను నా ఫ్యాన్స్‌ని చూసి హీరోనయ్యా.
నా నుంచి కొత్త సినిమా వచ్చి మూడేళ్లయినా మీరు చూపే ప్రేమ అస్సలు తగ్గలే. నన్ను ప్రేమించే వాళ్ల కోసం నిలబడగలగాలి. మన అనుకున్న వాళ్ల కోసం ఎంత వరకైనా వెళ్తా..! అంటూ కామెంట్ చేశారు.దీంతో అల్లు - మెగా ఫ్యామిలీల మధ్య గ్యాప్ మరింత పెరిగినట్టు అయింది.ఇదిలా ఉంటే మెగాస్టార్ చిరంజీవి పూజ గదిలో అల్లు రామలింగయ్య ఫొటో వైరల్‌గా మారింది. చిరంజీవి ఇంట్లో ఉన్న పూజా మందిరంలో దేవుడి ఫొటోలతో పాటు చిరంజీవి తండ్రి వెంకట్రావు ఫొటో, మామయ్య అల్లు రామలింగయ్య ఫోటోలు కూడా పెట్టుకున్నారు. దేవుళ్లతో పాటు వాళ్ళని కూడా దేవుళ్లుగా భావిస్తూ నిత్యం పూజలు చేస్తున్నారు చిరంజీవి. ఇప్పుడీ ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి. మరి వీటిని చూసైనా మెగా వర్సెస్ అల్లు వార్‌కు శుభం కార్డ్ పడుతుందేమో చూడాలి.












Click it and Unblock the Notifications