సైలెంట్‌గా నిశ్చితార్థం చేసుకున్న మెగా డాటర్ ..? ఫొటో లీక్

మెగా డాటర్ నిహారిక వ్యక్తిగత జీవితం గురించి అందరికి తెలిసిన విషయమే. తొలుత టీవీ షోల్లో హోస్ట్‌గా కనిపించిన నిహారిక తర్వాత వెండితెరపై హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఒక మనస్సు, సూర్యకాంతం, హ్యాపీ వెడ్డింగ్ వంటి సినిమాల్లో నటించినప్పటికీ నిహారికకు తగిన గుర్తింపు దక్కలేదు. ఆమె కెరీర్‌లో ఇప్పటి వరకు ఒక్క హిట్ కూడా లేదు. దీంతో పెళ్లి పీటలెక్కింది. జొన్నలగడ్డ చైతన్యను ప్రేమించి పెళ్లాడింది.

అయితే మెగా డాటర్ భర్త చైతన్యతో కాపురాన్ని ఎక్కువ కాలం కొనసాగించ లేకపోయింది. అతనితో విడాకులు తీసుకుని మెగా అభిమానులకు గట్టి షాకే ఇచ్చింది. విడాకులు అనంతరం నిహారిక తిరిగి సినిమాల్లో నటిస్తోంది. మంచు మనోజ్‌ పక్కన హీరోయిన్‌గా నటించేందుకు మెగా డాటర్ నిహారిక గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తమిళంలో 'మద్రాస్‌కారన్' మూవీలో హీరోయిన్‌గా నటించింది. సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా యావరేజ్‌గా నిలిచింది.

photo shared by Niharika on Instagram has gone viral

తెలుగులో మనోజ్ నటిస్తోన్న ''వాట్ ది ఫిష్'' అనే సినిమాలో నిహారిక హీరోయిన్‌గా ఎంపికైంది. ఈ సినిమా అతి త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. మరోవైపు ఆమె తొలిసారి నిర్మాతగా మారి తెరకెక్కించిన ''కమిటీ కుర్రాళ్లు'' సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది.

ఇదిలా ఉంటే తాజాగా నిహారికకు సంబంధించిన ఓ వార్త నెట్టింట వైరల్‌గా మారింది. నిహారిక సీక్రెట్‌గా నిశ్చితార్థం చేసుకుందనేది ఈ వార్త సారాంశం. నిహారిక కొణిదెల తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేసిన ఒక ఫొటో ప్రస్తుతం అభిమానుల దృష్టిని ఆకర్షిస్తోంది. ఆ ఫొటో చూస్తుంటే ఏదో శుభకార్యం, ముఖ్యంగా పూజ లేదా నిశ్చితార్థం వంటి వేడుకకు సంబంధించినదిగా కనిపిస్తోంది.ఈ ఫొటోలో నిహారిక పట్టుచీర ధరించి సంప్రదాయబద్ధంగా కనిపించారు.

ఆమె చేతులకు అందమైన గోరింటాకు పెట్టుకుని ఉండగా, తలలో మల్లె పూలు ధరించి కూర్చున్నట్లుగా ఉంది. ఈ దృశ్యం కుటుంబంలో ఏదో ముఖ్యమైన శుభకార్యం జరగబోతోందా లేదా జరిగిందా అన్న సందేహాలను లేవనెత్తుతోంది. నిహారిక తన స్టోరీలో ఈ ఫోటోను ఎలాంటి క్యాప్షన్ లేకుండా పోస్ట్ చేయడంతో, దీని వెనుక ఉన్న పూర్తి వివరాలు తెలియడం లేదు. అయినప్పటికీ, ఈ ఫొటో ఆమె అభిమానుల మధ్య చర్చకు దారి తీసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+