ఏంటి ఆ తెలుగు హీరోయిన్ 'గే' నా..?

ఓ ప్రముఖ హీరోయిన్ గురించి ఇప్పుడు విపరీతమైన చర్చ సాగుతోంది. ఎందుకంటే ఆమె చేసిన పని టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. ఆమె ముద్దు పెట్టడమే దీనికి కారణం. సినీ ఇండస్ట్రీలో ముద్దు పెట్టడం పెద్ద తప్పు కాకపోవచ్చు. అయితే ఆమె ముద్దు పెట్టింది చిన్న వాళ్లకో లేదా ,అబ్బాయికో కాదు.. మరో మహిళకు. ఇదే ఇప్పుడు సంచలనంగా మారింది. ఇలా అమ్మాయికి ముద్దు పెట్టిన హీరోయిన్ మరెవరో కాదు..సంయుక్త హెగ్డే.

కన్నడ చిత్రాలలో నటించిన సంయుక్త హెగ్డే, తన నటనతో ప్రత్యేక గుర్తింపు దక్కించుకుంది. 2016లో రక్షిత్ శెట్టి దర్శకత్వంలో వచ్చిన 'కిరిక్ పార్టీ' చిత్రంతో నటిగా అరంగేట్రం చేసింది. ఈ సినిమాలో ఆమె పోషించిన 'ఆర్య' పాత్రకు విమర్శకుల ప్రశంసలు లభించాయి. ఈ సినిమాతోనే ఆమె ఫిల్మ్‌ ఫేర్ ఉత్తమ సహాయ నటి ,కన్నడ అవార్డును గెలుచుకుంది.

Photos of heroine Samyuktha Hegde giving a lip kiss to her friend go viral

'కిరిక్ పార్టీ' రీమేక్ అయిన 'కిర్రాక్ పార్టీ' సినిమాతో పరిచయమైంది, ఇందులో నిఖిల్ సిద్ధార్థ్ సరసన నటించింది. తమిళంలో, జయం రవి, కాజల్ అగర్వాల్‌తో కలిసి 'కోమలి' (2019) చిత్రంతో ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాలో తన పాత్ర నికితకు మంచి ప్రశంసలు దక్కాయి. ఈ సినిమా కోసం ఆమె తమిళం నేర్చుకుని సొంతంగా డబ్బింగ్ చెప్పుకుంది.

సినిమాలతో పాటు, సంయుక్త హెగ్డే పలు టీవీ రియాలిటీ షోలలోనూ పాల్గొని తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది. బిగ్ బాస్ కన్నడ సీజన్ 5లో వైల్డ్ కార్డ్ ఎంట్రీగా ప్రవేశించి, తన బోల్డ్ స్వభావంతో ఆకట్టుకుంది. ఇదిలా ఉంటే సంయుక్త హెగ్డే చేసిన పని ఇప్పుడు సంచలనంగా మారింది.సంయుక్త హెగ్డే ఈ మధ్య తన స్నేహితురాలు పూజిత భాస్కర్ వివాహ వేడుకకు హాజరైంది. అయితే అక్కడ ఆమె చేసిన పని హాట్ టాపిక్‌గా మారింది.

సంయుక్త హెగ్డే ఆమె స్నేహితురాలితో లిప్-టు-లిప్ కిస్ ఇచ్చింది. దీనికి సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఈ ఫొటోలు చూసిన నెటిజన్లు తమదైనశైలిలో రియాక్ట్ అవుతున్నారు. కొంపదీసి ఆ హీరోయిన్ 'గే' నా ఏంటి అని అనుమానిస్తున్నారు. లేకపోతే ఎవరైనా ఫ్రెండ్‌కు లిప్ లాక్ ఇస్తారా అంటూ ప్రశ్నిస్తున్నారు. మరి కొందరు సినిమా వాళ్లకు ఇది కామన్ అంటూ రియాక్ట్ అవుతున్నారు. ఈ ఘటనతో సంయుక్త హెగ్డే ఒక్కసారిగా టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారిపోయింది. ప్రస్తుతం సంయుక్త హెగ్డే లిప్ కిస్ ఇచ్చిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+