ప్రధాని దెబ్బకు ఆగిన రకుల్ పెళ్లి

తెలుగులో టాప్ హీరోయిన్‌గా ఒకప్పుడు రకుల్ ప్రీత్ సింగ్ ఓ వెలుగు వెలిగిన సంగతి అందరికి తెలిసిందే. మహేష్ బాబు, ఎన్టీఆర్ , అల్లు అర్జున్, రామ్ చరణ్ వంటి స్టార్ హీరోల సరసన నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. తెలుగులో నెంబర్ వన్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన రకుల్.. వరుస ఫ్లాపులతో డీలా పడిపోయింది.

కోలీవుడ్, బాలీవుడ్‌లో కొన్నిసినిమాల్లో నటించినప్పటికీ అక్కడ ఆమెకు సరైన హిట్ మాత్రం దక్కలేదు. దీంతో రకుల్‌కు అవకాశాలు తగ్గిపోయాయి. ఇదే సమయంలో రష్మిక, పూజా హెగ్డె, శ్రీలీల వంటి స్టార్స్ ఇండస్ట్రీలోకి దూసుకురావడంతో రకుల్ రేసులో వెనుకపడిపోయింది. ఫొటో షూట్లు, జిమ్ వీడియోలతో హల్ చల్ చేయడం తప్పిస్తే.. వెండితెర మీద రకుల్ కనిపించి రెండేళ్లకు పైగానే కావొస్తోంది.

PM modi call Rakul & Jackky change wedding venue

చేతిలో సినిమాలు లేకపోవడంతో రకుల్ లైఫ్‌లో సెటిల్ కావాలని చూస్తోంది. పెళ్లి చేసుకోని వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టాలని చూసిన రకుల్‌కు ప్రధాని మోదీ ఇచ్చిన ఓపిలుపు పెద్ద అడ్డంకిగా మారింది. రకుల్ ప్రస్తుతం జాకీ భగ్నానీతో ప్రేమలో ఉందనే విషయం అందరికి తెలిసిందే. ప్రస్తుతం వీరిద్దరు డేటింగ్‌లో ఉన్నారు.

గతేడాదే వీరు పెళ్లి పీటలెక్కాలని భావించిన ఈ జంటకు ప్రధాని మోదీ బ్రేక్ వేశారు. ప్రధాని మోదీ ఇచ్చిన పిలుపు కారణంగా వీరు తమ పెళ్లిని వాయిదా వేసుకున్నారని తెలుస్తోంది. గతంలో సెలబ్రిటీలందరూ కూడా తమ పెళ్లిళ్లను విదేశాల్లో జరుపుకునేవారు. ముఖ్యంగా మాల్దీవులు, ఇటలీ వంటి దేశాలకు వెళ్లి పలువురు పెళ్లి చేసుకున్నారు.

PM modi call Rakul & Jackky change wedding venue

డబ్బున్న వాళ్లు , సెలబ్రిటీలు పెళ్లితో పాటు తమ జీవితంలో అతి ముఖ్యమైన కార్యాలను ఇండియాలోనే జరుపుకోవాలని ప్రధాని మోదీ పిలుపినిచ్చారు. మోదీ ఇచ్చిన పిలుపుతో రకుల్ తన పెళ్లిని విదేశాల్లో కాకుండా , స్వదేశంలోనే జరుపుకోవాలని నిర్ణయించుకుందట. గోవాను తన పెళ్లి వేదికగా మార్చుకున్న రకుల్ .. సరైన మూహార్తం కోసం ఎదురు చూస్తోందని తెలుస్తోంది. అతి త్వరలోనే రకుల్ తన ప్రియుడు జాకీ భగ్నానీని స్వదేశంలోనే పెళ్లాడనుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+