యానిమ‌ల్ హీరో ర‌ణ‌బీర్ క‌పూర్‌పై పోలీసుల‌కు ఫిర్యాదు...

యానిమ‌ల్ సినిమాతో బాలీవుడ్ న‌టుడు ర‌ణ‌బీర్ క‌పూర్ భారీ విజ‌యాన్నే అందుకున్నారు. ఈ సినిమా భారీ వ‌సూళ్ల‌నే రాబ‌ట్టింది. ఇంకా ఈ సినిమా క్రేజ్ త‌గ్గ‌నేలేదు. ఈ సినిమా స‌క్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్న‌ర‌ణ‌బీర్ క‌పూర్‌కు తాజాగా ఓ షాక్ త‌గిలింద‌నే చెప్పుకోవాలి. న‌టుడు ర‌ణ‌బీర్‌క‌పూర్‌పై పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. ర‌ణ‌బీర్ క‌పూర్ హిందువుల సెంటిమెంటును దెబ్బతీశాడంటూ ఇద్దరు లాయర్లు ఆయ‌న‌పై పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఈ నెల 25న దేశవ్యాప్తంగా క్రిస్మ‌స్ సంబ‌రాలు అంబ‌రాన్నంటాయి. ఈ క్రిస్మ‌స్ వేడుకల‌ను న‌టుడు ర‌ణ‌బీర్ క‌పూర్ ఇంట కూడా జ‌రిగాయి. కపూర్‌ ఫ్యామిలీ అంతా కలిసి ముంబైలోని కునాల్‌ కపూర్‌ ఇంట్లో క్రిస్మస్‌ సంబురాలు ఎంతో వైభ‌వంగా నిర్వ‌హించుకున్నారు. ఈ వేడుకల్లో రణ్‌బీర్ కపూర్‌తోపాటు ఆయన కుటుంబసభ్యులు అంద‌రూ ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు.

Police complaint against animal hero Ranbir Kapoor...

ఈ వేడుక‌ల్లో భాగంగా కేక్‌పై మద్యాన్ని పోసి నిప్పంటించి జై మాతా ది అంటున్న వీడియో ఒక‌టి నెట్టింట తెగ వైర‌ల్ అయ్యింది. హిందూ మతంలో ఇతర దేవతలను పిలిచే ముందు అగ్ని దేవుణ్ణి ఆరాధిస్తారు. ఇది హిందువుల సంప్ర‌దాయం. అయితే, న‌టుడు రణబీర్ కపూర్, అతని కుటుంబ సభ్యులు కావాల‌నే క్రైస్తవ మతం పండుగను జరుపుకునే సమయంలో ఆల్క‌హాల్‌ను ఉపయోగించారని, జై మాతా ది అనే నినాదాలు చేశారని సంజయ్ తివారీ అనే వ్య‌క్తి తీవ్ర ఆరోప‌ణ‌లు చేశారు.

ముంబైలోని ఘట్‌కోపర్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు..

ఈ విధంగా న‌టుడు ర‌ణ‌బీర్ క‌పూర్ హిందువుల సెంటిమెంట్‌ను దెబ్బ‌తీశాడంటూ సంజయ్ తీవారి అనే వ్య‌క్తి తన న్యాయ‌వాదులు ఆశిష్‌ రాయ్‌, పంకజ్‌ మిశ్రాతో కలిసి ముంబైలోని ఘట్‌కోపర్‌ పోలీస్‌ స్టేషన్‌లో ర‌ణ‌బీర్ క‌పూర్‌పై ఫిర్యాదు చేశారు. అయితే, ఈ కేసులో ఇంకా ప్రథమ సమాచార నివేదికను నమోదు చేయ‌లేదు. ఈ విధంగా రణబీర్ కపూర్ సనాతన ధర్మాన్ని కించపరుస్తూ నినాదాలు చేశారని, తమ మతపరమైన మనోభావాలను దెబ్బతీశారని సంజ‌య్ తీవారి పోలీసుల‌కు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+