బుట్టబొమ్మ కెరీర్ క్లోజ్?

టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు ఒకప్పుడు మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా వెలిగిపోయిన పూజా హెగ్డే.. ప్రస్తుతం తన కెరీర్లో అత్యంత క్లిష్ట దశను ఎదుర్కొంటోంది. వరుసగా ఆమె నటించిన 'దేవా', 'రెట్రో' చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాయి. దీంతో ఇప్పుడు ఆమె ఆశలన్నీ కోలీవుడ్ చిత్రం 'జననాయగన్', బాలీవుడ్ మూవీ 'హాయ్ జవానీ తో ఇష్క్ హోనా హై'పైనే ఉన్నాయి. వీటితో పాటు రాఘవ లారెన్స్ 'కాంచన 4', దుల్కర్ సల్మాన్ 'DQ41' చిత్రాల్లో కూడా ఆమె నటిస్తోంది.

ఏడేళ్లుగా అందని విజయం
గత కొన్నేళ్లుగా పూజా హెగ్డేకు ఓ సరైన హిట్ కూడా దక్కలేదు. 2022లో ప్రభాస్ సరనస నటించిన 'రాధే శ్యామ్' నుంచి మొదలుకొని బీస్ట్, ఆచార్య, సర్కస్, 'కిసీ కా భాయ్ కిసీ కీ జాన్', దేవా, రెట్రో చిత్రాల వరకు ఆమె నటించిన దాదాపు ఏడుకు పైగా సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. పాన్-ఇండియనా స్థాయిలో క్రేజ్ ఉన్నప్పటికీ.. వరుస డిజాస్టర్లు ఆమె మార్కెట్‌ను దెబ్బతీస్తున్నాయి. ఈ క్రమంలో ఓ భారీ విజయం సాధించి మళ్లీ ఫామ్‌లోకి రావాలని పూజా హెగ్డే గట్టిగా ప్రయత్నిస్తోంది.

Pooja Hegde Career in Crisis Will Jana Nayagan and Kanchana 4 Save the Butta Bomma Career

'జననాయగన్'లీక్ కలకలం
దళపతి విజయ్ సరసన పూజ్ హెగ్డే నటించిన 'జననాయగన్' చిత్రంపై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఈ సినిమాతోనైనా పూజా హెగ్డే సక్సెస్ ట్రాక్ ఎక్కుతుందని భావించారు. అయితే సెన్సార్‌షిప్ సమస్యల కారణంగా ఈ చిత్రం విడుదల ఆలస్యం కావడం.. అదే సమయంలో ఈ సినిమా ఆన్‌లైన్లో లీక్ కావడం పూజా హెగ్డే కెరీర్‌పై పెద్ద దెబ్బ అని చెప్పవచ్చు. ఈ పరిణామాల వల్ల 'జననాయగన్' బాక్సాఫీస్ వద్ద పెద్దగా ఇంపాక్ట్ చూపించలేకపోవచ్చని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

బాలీవుడ్ సినిమాపై ట్రోల్స్
ఇక తాజాగా పూజా హెగ్డే నటిస్తున్న బాలీవుడ్ సినిమా 'హాయ్ జవానీ తో ఇష్క్ హోనా హై' గ్లింప్స్ విడుదలైంది. అయితే ఇందులో ఏఐ వాడకంపై సోషల్ మీడియాలో భారీగా ట్రోల్స్ వచ్చాయి. మేకర్స్ దీనిపై వివరణ ఇస్తూ.. సినిమాలో ఏఐ వాడటం లేదని చెప్పినప్పటికీ.. అప్పటికే ప్రేక్షకుల నుంచి నెగటివ్ రెస్పాన్స్ రావడంతో సినిమాపై బజ్ తగ్గింది. అయితే ఈ గ్లింప్స్‌లో పూజా లుక్స్ మాత్రం ఆకట్టుకున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో 'కాంచన 4', 'DQ41' చిత్రాలు మాత్రమే ఆమెకు మిగిలిన ఆఖరి ఆశలుగా కనిపిస్తున్నాయి. రాబోయే చిత్రాలు పూజా హెగ్డే కెరీర్‌కు అత్యంత కీలకం కానున్నాయి. మరి ఈ 'బుట్టబొమ్మ' తన పాత వైభవాన్ని మళ్లీ సొంతం చేసుకుంటుందో లేదో వేచి చూడాల్సిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+