దేవరలో స్టార్ హీరోయిన్ ఐటెం సాంగ్
కొరటాల శివ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ కథానాయకుడిగా రాబోతున్న చిత్రం దేవర. పాన్ ఇండియా సినిమాగా విడుదల కాబోతోంది. ఈ ఏడాది ఏప్రిల్ 5వ తేదీన మొదటి భాగాన్ని విడుదల చేయాలనుకున్నప్పటికీ విజయ దశమికి విడుదల చేస్తున్నారు. దేశవ్యాప్తంగా ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. వరుసపెట్టి బ్లాక్ బస్టర్ సినిమాలిచ్చిన కొరటాల ఆచార్య ఫ్లాప్ కావడంతో కసిగా ఈ సినిమాను చేస్తున్నారు. కచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్ కొడతామనే నమ్మకంతో ఎన్టీఆర్, కొరటాల ఉన్నారు.
ఈ సినిమాలో ఒక ఐటెం సాంగ్ తీయాలని కొరటాల భావించి అందుకు తగ్గ స్టార్ హీరోయిన్ కోసం వెతికారు. చివరకు పూజా హెగ్డే తో ఈ సాంగ్ తీయబోతున్నట్లు తెలుస్తోంది. గతంలో పూజా రంగస్థలం సినిమాలో ఓ ఐటెం సాంగ్ చేసింది. ఆ పాటకు భారీగా రెస్పాన్స్ వచ్చింది. తాజాగా పూజా ఓకే అందని తెలుస్తోంది. ఈ సాంగ్ కూడా సూపర్ గా వచ్చే అవకాశం ఉందంటున్నారు. దేవరకు సంబంధించి ఇటీవలే నాన్ థియేట్రికల్ రైట్స్‌ను భారీ ధరలకు క్లోజ్ చేశారు. థియేట్రికల్ రైట్స్ ను ప్రాంతాలవారీగా పూర్తిచేస్తున్నారు.

బాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ కరణ్ జోహార్ కి చెందిన 'ధర్మ ప్రొడక్షన్స్' తో కలిసి అనిల్ తడానీ ఏఏ ఫిలిమ్స్ దేవరకు సంబంధించిన నార్త్ బెల్ట్ థియేట్రికల్ రైట్స్ ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఫక్తు వ్యాపార సంస్థలు దేవర కోసం రంగంలోకి దిగడంతో ఈ సినిమా కచ్చితంగా హిట్ అని తారక్ అభిమానులు నమ్మకంతో ఉన్నారు. సినిమా ఆడుతుంది.. లాభం ఉంటుంది అనుకుంటేనే ఈ సంస్థలు రంగంలోకి దిగుతాయంటున్నారు. మ్యూజిక్ రైట్స్ ను టిసిరీస్ కొనుగోలు చేసింది. అనిరుధ్ రవిచందర్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఓవర్సీస్ మ్యూజిక్ రైట్స్ రూ.27 కోట్లకు హంసిని ఎంటర్ టైన్ మెంట్ సొంతం చేసుకుంది.












Click it and Unblock the Notifications