నువ్వు.. ఇలాంటి ఫొటోలు దిగితే ఎలా పూజా?
బుట్టబొమ్మ పూజా హెగ్డే వరుసగా సూపర్ హిట్ సినిమాలతో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. అయితే దురదృష్టవశాత్తూ ఈ అమ్మడుకు ప్రస్తుతం కాలం కలిసిరావడంలేదు. గతేడాది వరుసగా నాలుగు సినిమాలు ఫ్లాపవడంతో నిర్మాత, దర్శకులు, హీరోలు పూజాను దూరం పెట్టడం ప్రారంభించారు. సినిమా అవకాశాలు రావడంలేదని దిగులుచెందుతున్న సమయంలోనే అందివచ్చిన గుంటూరు కారం, ఉస్తాద్ భగత్ సింగ్ కూడా అనుకోని కారణాలతో ఈ ముద్దుగుమ్మ నుంచి దూరమయ్యాయి.
సోషల్ మీడియాలో ఎప్పుడూ చురుగ్గా ఉంటుంది. తన అందాలతో పూజా మరోసారి రెచ్చగొట్టే ప్రయత్నాలు చేసింది. కుర్రకారుకు నిద్ర లేకుండా చేసేందుకు సరికొత్త దుస్తుల్లో ఫోజులిచ్చింది. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. పూజా అదరగొట్టేసిందని కొందరు కామెంట్లు పెడుతుండగా, మరికొందరు ఈ దుస్తుల్లో పూజా అదిరిపోయిందంటూ కామెంట్లు చేస్తున్నారు. చివరగా పూజాహెగ్డే ఏం చేసినా, ఏ డ్రస్ వేసినా సూపర్ అంటున్నారు కుర్రకారు.

నాగచైతన్య సరసన ఒక లైలాకోసం సినిమాతో తెలుగు పరిశ్రమకు పరిచయమైన ఈ భామ వరుణ్ తేజ్ సరసన చేసిన ముకుందతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. ఆ తర్వాత హృతిక్ రోషన్ సరసన మొహంజదారో సినిమాలో అవకాశం రావడంతో టాలీవుడ్ ను వదిలిపెట్టి బాలీవుడ్ లోకి వెళ్లింది. మొహంజదారో ఫ్లాపవడంతో మళ్లీ తెలుగు పరిశ్రమలోకి అడుగుపెట్టింది. వరుసగా అన్నీ సూపర్ హిట్ సినిమాలు చేయడంతో అమ్మడుది గోల్డెన్ లెగ్ అంటూ పరిశ్రమ మొత్తం పూజా వెంట పడింది.
రాధేశ్యామ్, బీస్ట్, తదితర చిత్రాలు డిజాస్టర్లుగా నిలవడంతో అవకాశాలు రావడం కష్టంగా మారింది. ఉన్న సినిమాలు కూడా చేజారిపోవడంతోపాటు కొత్తగా ఎటువంటి సినిమాలు లేకపోవడంతో సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటూ ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన చిత్రాలను అప్ డేట్ చేస్తూ అవకాశాల కోసం ఎదురుచూస్తోంది.












Click it and Unblock the Notifications