అల్లుఅర్జున్ సరసన మూడోసారి జతకట్టనున్న పూజా హెగ్డే ..
నటి పూజా హెగ్డే పేరు తెలియని వారుండరు. బుట్టబొమ్మ.. బుట్టబొమ్మ అంటూ కుర్రకారు హృదయాలను కొల్లగొట్టేసింది ఈ బ్యూటీ. టాలీవుడ్‌లో అనతి కాలంలోనే అగ్రహీరోలందరితో నటించి మంచి స్టార్‌డమ్‌ను సొంతం చేసుకుంది ఈ అమ్మడు. అల్లుఅర్జున్‌తో ఈ అమ్మడు నటించిన రెండు సినిమాలు మంచి విజయాలు సాధించాయి. దువ్వాడ జగన్నాధమ్, అల వైకుంఠపురం సినిమాతో మంచి సక్సెస్‌ను చవిచూసింది ఈ బ్యూటీ. అయితే, అమ్మడుకి అలవైకుంఠపురం సినిమా తర్వాత హిట్ దొరకలేదు. ఆ చిత్రం తర్వాత ప్రభాస్‌తో సినిమా చేసిన అది అనుకున్న ఫలితాన్ని అందించలేదు. తాజాగా ఈ బ్యూటీ మరోసారి ఐకాన్‌స్టార్ అల్లుఅర్జున్‌తో జోడికట్టనున్నట్లు తెలుస్తోంది.
అయితే, వీరి కాంబినేషన్‌లో ముచ్చటగా మూడోసారి మరో హిట్ పడనుందని సినీ వర్గాల్లో టాక్. అల్లుఅర్జున్ పుష్ప2 చిత్రీకరణలో ఫుల్ బిజిగా ఉన్నారు. ఈ సినిమా తర్వాత బన్నీ మరో మూడు సినిమాలకు ఓకే చెప్పినట్లు సమాచారం. ఈ మూడు ప్రాజెక్టులతో పాటు మరో ప్రాజెక్టుకు బన్నీ రెడీ అయినట్లు తెలుస్తోంది. ఇక ఈ చిత్రంలో బన్నీ సరసన బుట్టబొమ్మ నటిస్తుందనే టాక్ టీ టౌన్ వర్గాల్లో తెగ వినిపిస్తోంది. ఈ ప్రాజెక్టుకు స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వం వహిస్తున్నారు. మాటల మాంత్రికుడు త్రివ్రిక్రమ్, యానిమల్ దర్శకుడు సందీప్ వంగా, బోయపాటి శీనులతోపాటు అట్లీతో కూడా బన్నీ సినిమాలు తీస్తున్నట్లు సమాచారం. అయితే, ఈ మూడు ప్రాజెక్టుల కంటే ముందే దర్శకుడు అట్లీతో అల్లుఅర్జున్ సినిమాకు రెడీ అయినట్లు సినీ వర్గాల్లో టాక్. ఇక, ఈ సినిమాలో నటి పూజాహెగ్డే అయితే బాగుంటుందనే ఆలోచనలో చిత్ర యూనిట్ ఉన్నట్లు సమాచారం. ఏది ఏమైనా బన్నీతో మరోసారి పూజాహెగ్దే జోడీ కట్టే అవకాశాన్ని సొంతం చేసుకుంది.

పాన్ ఇండియా లెవల్లో అట్లీ సినిమా : స్టార్ డైరెక్టర్ అట్లీ ఈ మధ్యకాలంలో జవాన్ సినిమాతో బాక్సాఫీస్ వద్ద రికార్డుల వర్షం కురిపించారు. ఈ సినిమా పాన్ ఇండియా లెవల్లో వచ్చిన సంగతి తెలిసిందే. ఇక, ఐకాన్ స్టార్‌తో తీయనున్న సినిమా కూడా పాన్ఇండియా లెవల్లో ఉండబోతున్నట్లు సమాచారం. ప్రస్తుతం అల్లుఅర్జున్ పుష్ప2 షూటింగ్ పూర్తి చేసే క్రమంలో ఉన్నాడు. ఈ ఏడాది ఆగస్ట్ 15న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.
-
మెగాస్టార్‌కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
ఢిల్లీలో జగన్ రూటు మారిందా, పార్లమెంట్ సాక్షిగా - కీలక మలుపు..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
టీం ఇండియాకు బీసీసీఐ భారీ నజరానా, ఒక్కొక్కరికి ఎంతంటే..!! -
పెట్రోల్ పై కేంద్రం ఎస్మా ప్రయోగం:LPG ఉత్పత్తి పెంచాలని హుకుం -
భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు! -
మిథున రాశి 2026 2027 జాతకం.. ఈ ఏడాది వీరి మాటే శాసనం! -
టీమిండియాపై విధ్వంసకర సెంచరీ: కెప్టెన్‌గా ప్రమోషన్ -
వరల్డ్ కప్ గెలిచినా తప్పని చిక్కులు! ఆ ఆటగాడిపై ఐసీసీ వేటు?












Click it and Unblock the Notifications