ఎట్టకేలకు ప్రియుణ్ని పెళ్లాడిన పూజా
తెలుగు, తమిళం, హిందీ అనే కాకుండా భారతదేశంలోని అన్ని చిత్ర పరిశ్రమల్లో ఉన్న హీరో హీరోయిన్లంతా బ్రహ్మచర్య జీవితానికి స్వస్తి పలుకుతున్నారు. కొందరు ప్రేమించి పెళ్లిచేసుకుంటుండగా, మరికొందరు పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకుంటున్నారు. కొందరు సినిమాలకు గుడ్ బై చెబుతుండగా, పెళ్లయినప్పటికీ మరికొందరు మాత్రం సినిమాల్లో నటిస్తున్నారు. తాజాగా గుజరాతీ చిత్ర పరిశ్రమకు చెందిన హీరోయిన్ పూజ జోషి వివాహం చేసుకుంది. ఈ నటి కొంతకాలంగా తన స్నేహితుడు మల్హర్ థాకర్ తో ప్రేమలో ఉన్నట్లు జోరుగా కథనాలు వచ్చాయి. వాటిని నిజం చేస్తూ ఈ జంట ఏడడుగుల బంధంతో ఒకటైంది. తన ఇన్ స్టా ఖాతాద్వారా ఈ అమ్మడు వివరాలను వెల్లడించింది. సోషల్ మీడియాలో ఫొటోలు షేర్ చేసింది. తన భర్తను ముద్దులతో ముంచెత్తుతున్న ఫొటోలను షేర్ చేయడంతో భర్త అంటే ఎంత ప్రేమో అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
జైనబ్ రవ్జీ చిత్రకారిణి
తాజాగా తెలుగులో అక్కినేని నాగచైతన్య బాలీవుడ్ నటి శోభిత ధూళిపాళను ప్రేమించి పెళ్లి చేసుకోబోతున్నారు. వచ్చే నెలలో వీరి వివాహం జరగబోతోంది. తన తమ్ముడు అక్కినేని అఖిల్ కూడా ఓ ఇంటివాడు కాబోతున్నాడు. అకస్మాత్తుగా అందరినీ ఆశ్చర్యపరుస్తూ అఖిల్ నిశ్చితార్థం జరిగింది. జైనబ్ రవ్జీతో జరిగి నిశ్చితార్థానికి సంబంధించి ఫొటోలను అక్కినేని నాగార్జున ట్విటర్ లో పెట్టడంతో విషయం తెలిసింది. నాగచైతన్య నిశ్చితార్థం కూడా ఇలాగే ట్విటర్ లో నాగార్జున ఫొటోలు పెట్టడంవల్లే జరిగింది. శోభిత ధూళిపాళ తెలుగమ్మాయి. వారి సొంత ఊరు తెనాలి. అలాగే జైనబ్ రవ్జీకి మంచి చిత్రకారిణిగా పేరుంది. లండన్, దుబాయ్ లాంటి ప్రాంతాల్లో ప్రదర్శనలిచ్చింది.

ఓడియన్ థియేటర్ అధినేత కూతురు
ఆమె తండ్రి జుల్ఫీ రవ్జీకి, నాగార్జున కొన్ని సంవత్సరాల నుంచి స్నేహితులు. హైదరాబాద్ లో పుట్టి ముంబయిలో స్థిరపడిన కుటుంబం ఇది. హైదరాబాద్ లో ఓడియన్ థియేటర్ అంటే తెలియనివారుండరు. ఈ థియేటర్ ఓనరే జుల్ఫీ రవ్జీ. తాజాగా దీన్ని మల్టీప్లెక్స్ గా మారుస్తున్నారు. స్టూడియో ఓనరైన నాగార్జున, థియేటర్ ఓనరైన జుల్ఫీ వియ్యంకులు కాబోతున్నారు. ఈయనకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ తో సన్నిహిత సంబంధాలున్నట్లు వార్తలు వస్తున్నాయికానీ వాటిపై స్పష్టత లేదు.












Click it and Unblock the Notifications