ఓటీటీలోకి 'పూకీ' మూవీ.. ఇక రచ్చ రచ్చే..!
యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ మూవీస్ కు ఎప్పుడూ ఫ్యాన్స్ ఉంటారు. కొత్త తరహా కథలను ఆదరించడంలో తెలుగు ప్రేక్షకులు ముందుంటారు. కంటెంట్ ఉంటే చిన్న సినిమా లేదా పెద్ద సినిమా అని చూడకుండా ఆదరిస్తారు. అయితే ఇటీవల వాలెంటైన్స్ డే సందర్భంగా థియేటర్లలో రిలీజ్ అయిన పూకీ మూవీ యువతను ఆకట్టుకుంది. ఈ సినిమాకు ఐఎండీబీలో 7.3 రేటింగ్ నమోదైంది. జెన్ జీ ఆలోచనలు, లవ్ స్టోరీ నేపథ్యంలో తెరకెక్కిన తమిళ మూవీ ఇప్పుడు ఓటీటీలోకి రానుంది.
ప్రముఖ నటుడు విజయ్ ఆంటోనీ అక్క కొడుకు అజయ్ దీషన్ హీరోగా నటించిన లేటెస్ట్ తమిళ మూవీ 'పూకీ'. వాలెంటైన్స్ డే సందర్భంగా ఈ మూవీ ఫిబ్రవరి 13న విడుదలైంది. సలీమ్ చిత్రానికి సినిమాటోగ్రాఫర్ గా పనిచేసిన గణేశ్ చంద్ర ఈ మూవీకి దర్శకత్వం వహించాడు. ఈ చిత్రాన్ని విజయ్ ఆంటోనీ నిర్మించారు. అలాగే పూకీ సినిమాలో ఓ ప్రముఖ పాత్రలోనూ నటించి తనదైన శైలిలో మెప్పించాడు. అయితే పూకీ మూవీ బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది.
ఇక ఈ మూవీ డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ జీ5 సొంతం చేసుకుంది. తాజాగా వస్తున్న సమాచారం ప్రకారం మార్చి 13 నుండి పూకీ మూకీ స్ట్రీమింగ్ కానుంది. లక్ష్మీ మంచు కీలక పాత్రలో నటించిన ఈ సినిమాను తెలుగులో 'బూకీ' (Bookie) అనే పేరుతో థియేటర్లలో విడుదల చేసిన విషయం తెలిసిందే. కానీ ఈ మూవీ ప్రేక్షకుల్ని అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఇక ఓటీటీలో తమిళ వెర్షన్ తో పాటే తెలుగు వెర్షన్ కూడా అదే రోజున వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ఇక ఈ మూవీ కథ విషయానికి వస్తే.. కైలాష్ (అజయ్ దిషన్), ఆళి (ఆర్కే ధనుష) జంట మధ్యే కథ తిరుగుతుంది. దాదాపు ఆరేళ్ల పాటు ప్రేమలో ఉన్న వీరిద్దరి జీవితం ఒక చిన్న సంఘటనతో తలకిందులు అవుతుంది. కారు సైడ్ మిర్రర్ విరిగిపోయిందనే చిన్న కారణంతో రోడ్డు మీద వీరిద్దరి మధ్య పెద్ద వాగ్వాదం జరుగుతుంది. అలా ఆవేశంలో ఒకరినొకరు దూషించుకుంటారు. దాంతో ఈ మూవీ కీలక టర్న్ తీసుకుంటుంది. ఆ తర్వాత ఎలాంటి పరిణామాలు జరిగాయి..? విడిపోయిన ఈ జంట తిరిగి కలుస్తారా..? లేదా..? అనేది సినిమాలో చూడాలి.
-
‘ధురంధర్2’ దెబ్బకు ‘పుష్ప2’ రికార్డులు గల్లంతు -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
రామ్ చరణ్ బర్త్ డే- మెగాస్టార్ వెరీ యూనిక్ సెలబ్రేషన్స్ -
సాయి పల్లవి ఫ్యాన్స్‌కు షాక్: పెళ్లిపై లేడీ పవర్ స్టార్ క్లారిటీ! -
రామ్ చరణ్ బర్త్‌డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
సమంత "వావ్" వీడియో వైరల్..! -
హనీమూన్ లో కొత్త జంట, ప్రైవేట్ రిసార్ట్‌లో ఆనంద క్షణాలు -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
నందమూరి బాలకృష్ణకు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు.. జై బాలయ్య !! -
శ్రీరాముడిగా మెప్పించిన తెలుగు హీరోలు వీళ్ళే..? -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..!












Click it and Unblock the Notifications